Begin typing your search above and press return to search.
కన్నా.. మీకు అవగాహన ఉందా ఏమైనా..?
By: Tupaki Desk | 1 Aug 2019 7:56 AM GMTకులాల వారీగా రిజర్వేషన్ల కల్పన అంశం కేంద్రం పరిధిలో ఉంది. రిజర్వేషన్ల గురించి ఏ మార్పు చేర్పులు చేయాలన్నా.. కేంద్ర ప్రభుత్వమే పూనుకోవాలి. అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు. అది కూడా భారతీయ జనతా పార్టీ నేతలు - భారతీయ జనతా పార్టీ ఏపీ విభాగం అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ఇలా మాట్లాడటం విడ్డూరంగా ఉంది.
ఈబీసీలకు అంటూ కేంద్రం పది శాతం రిజర్వేషన్లను కల్పించిన సంగతి తెలిసిందే. గత టర్మ్ లో మోడీ సర్కారు ఆ ప్రయోగం చేసింది. అందులో ఐదు శాతం కాపులకు అంటూ చంద్రబాబు నాయుడు మరో రాజకీయం చేశారు. కేంద్రం ఇచ్చింది ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత కులాల వారికి అని, అయితే చంద్రబాబు నాయుడు మాత్రం అందులో తన రాజకీయం చేసి కాపులకు ఐదు శాతం అని ప్రకటించారు. అయితే అది కోర్టులో చెల్లే అంశం కాదు. కేంద్రం ఇచ్చింది ఒకందుకు అయితే రాష్ట్రం మరో రకంగా వాడేందుకు అవకాశం ఉండదు. చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నా దాన్ని అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు.
అది ఎలాగూ సహేతుకమైన నిర్ణయం కాదు కాబట్టి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని పూర్తి గా రద్దు చేసింది. పదిశాతం రిజర్వేషన్లను అగ్రవర్ణాల్లోని అందరు పేదలూ వాడుకోవచ్చని పేర్కొంది ఏపీ ప్రభుత్వం. అయితే ఈ నిర్ణయాన్ని కన్నా లక్ష్మినారాయణ విమర్శించారు.
ఈ విషయంలో జగన్ నిర్ణయాన్ని ఆయన విమర్శించారు. అయినా తమ మోడీ చేతిలో ఉన్న అంశం గురించి కన్నా ఇలా జగన్ ను విమర్శించడం విడ్డూరంగా ఉంది. కాపులపై కన్నా లక్ష్మినారాయణకు అంత ప్రేమే ఉంటే, వారిని ఉద్ధరించాలని అనుకుంటే.. మోడీతో మాట్లాడవచ్చు.
కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని మోడీని కోరి ఒప్పించవచ్చు. అయితే ఆ పని చేయకుండా ఇలా జగన్ ను విమర్శిస్తే చాలని ఈ బీజేపీ నేత అనుకోవడం కామెడీగా ఉంది. రిజర్వేషన్లు కేంద్రం పరిధిలోని అంశం అయినా, ఇందులో కూడా ఏపీ బీజేపీ వాళ్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే యత్నం చేస్తూ తమ అవగాహన లేమిని చాటుకుంటూ ఉన్నారని, వీళ్లు ఈ కామెడీలు తగ్గించుకుంటే మంచిదని పరిశీలకులు అంటున్నారు.