Begin typing your search above and press return to search.

క‌న్నా... ఏపీ ప్ర‌జ‌ల క‌న్నీళ్లు తుడుస్తార‌ట‌!

By:  Tupaki Desk   |   5 July 2018 6:51 AM GMT
క‌న్నా... ఏపీ ప్ర‌జ‌ల క‌న్నీళ్లు  తుడుస్తార‌ట‌!
X
తెలుగు నేల‌ను రెండు రాష్ట్రాలుగా విభ‌జిస్తూ కాంగ్రెస్ పార్టీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంటే... యూపీఏ హ‌యాంలో రూపొందించిన విభ‌జ‌న చ‌ట్టాన్ని అమ‌లు చేయ‌డానికి ఎప్ప‌టిక‌ప్పుడు బ్రేకులేసుకుంటూ ముందుకు సాగుతున్న బీజేపీ... ఏపీ ప్ర‌జ‌ల‌ను న‌ట్టేట ముంచేశాసింద‌నే చెప్ప‌క త‌ప్ప‌దు. ఏదేనీ ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో రాష్ట్ర ప్ర‌భుత్వాలకు కేంద్రం సాయం చేయ‌డంలో పెద్ద‌గా ఇబ్బందేమీ ఉండ‌దు. అయితే పార్ల‌మెంటు సాక్షిగా ప్ర‌ధాని హోదాలో మ‌న్మోహ‌న్ సింగ్ ఇచ్చిన ప్ర‌త్యేక హోదా హామీని అమ‌లు చేసే విష‌యంలో న‌రేంద్ర మోదీ స‌ర్కారు ఏపీ ప్ర‌జ‌ల‌కు చుక్క‌లు చూపిస్తోంది. ఆర్థికంగా ఇంకా నిల‌దొక్కుకునేందుకు నానా తంటాలు ప‌డుతున్న ఏపీ... కేంద్రం స‌హాయ నిరాకర‌ణ‌తో మ‌రింత‌గా స‌మ‌స్య‌ల్లో చిక్కుకునే ప్ర‌మాదం లేక‌పోలేద‌న్న వాద‌న వినిపిస్తోంది. అయితే ఏపీకి అన్యాయం చేసిన వారెవ‌ర‌న్న విష‌యానికి వ‌స్తే... ఈ జాబితాలో ముందుగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని పేర్కొంటే, ఆ వెంట‌నే రెండో పేరుగా టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు పేరునే చెప్పాల్సి వ‌స్తుంది.

ఎందుకంటే... గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేసిన బీజేపీ - టీడీపీ అధికారంలోకి రాగానే ఏపీకి ప్ర‌త్యేక హోదాతో పాటుగా ఇత‌ర విభ‌జ‌న హామీల‌న్నింటినీ అమ‌లు చేసి తీర‌తామ‌ని చెప్పాయి. ఈ మాటలు చెప్పింది మ‌రెవ‌రో కాదు... స్వ‌యా న‌రేంద్ర మోదీ - చంద్ర‌బాబులే. ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత కేంద్రంలో బీజేపీ ఆధ్వ‌ర్యంలోని ఎన్డీఏ - రాష్ట్రంలో టీడీపీ అధ్వ‌ర్యంలో ప్ర‌భుత్వాలు ఏర్పాటు కాగా... మోదీ పీఎం సీటులో - చంద్ర‌బాబు సీఎం సీటులో కూర్చున్నారు. నాలుగేళ్ల పాటు క‌లిసే ప్ర‌యాణం సాగించారు. ఈ నాలుగేళ్ల ఉమ్మ‌డి ప్ర‌యాణంలో ఇటు చంద్ర‌బాబు ఏపీ ప్ర‌త్యేక హోదా సాధించింది లేదు. అటు మోదీ ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చింది లేదు. ఇద్ద‌రూ కూడ‌బ‌లుక్కుని మాట్లాడిన‌ట్లుగా 14వ ఆర్థిక సంఘం పేరు చెప్పి నాట‌కాలాడారు. ప్ర‌త్యేక హోదా బ‌దులుగా ప్ర‌త్యేక ప్యాకేజీ ఇస్తామ‌ని మోదీ చెబితే... హోదా కంటే ప్యాకేజీనే బెట‌రంటూ చంద్ర‌బాబు వంత పాడారు. మొత్తంగా నాలుగేళ్ల పాటు ఏపీ ప్ర‌జ‌ల‌కు అర‌చేతిలో వైకుంఠం చూపిన బీజేపీ - టీడీపీ... ఇప్పుడు ఎన్నిక‌లు ముంచుకువస్తున్న వేళ‌... బ‌ద్ధ శ‌త్రువులుగా మారిపోయాయి. ప్ర‌త్యేక హోదా వ‌ద్ద‌ని మొన్న‌టిదాకా త‌న‌దైన శైలిలో హెచ్చ‌రిక‌లు చేసిన టీడీపీ... ఇప్పుడు ఆ హోదా కోసం పోరాటం చేస్తున్నామంటూ కొత్త క‌ల‌రింగ్ ఇస్తోంది.

అదే స‌మ‌యంలో బీజేపీ కూడా తానేమీ త‌క్కువ తిన‌లేద‌న్న రీతిలో... ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చేది లేద‌ని తెగేసి మ‌రీ చెప్పేస్తోంది. నిన్న సుప్రీంకోర్టులో జ‌రిగిన విచార‌ణ సంద‌ర్భంగా బీజేపీ స‌ర్కారు ఇదే వాద‌న‌ను మ‌రింత బ‌లంగా వినిపించింది. ఈ నేప‌థ్యంలో కాసేప‌టి క్రితం మీడియా ముందుకు వ‌చ్చిన బీజేపీ ఏపీ చీఫ్ క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌... అస‌లు ప్ర‌జ‌లేమ‌నుకుంటున్నారు అన్న విష‌యాన్ని గాలికొదిలేసి... త‌న‌దైన శైలిలో ప్ర‌క‌ట‌న చేసుకుంటూ వెళ్లిపోయారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఏమ‌న్నారంటే... ఏపీకి ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయమని కన్నా పేర్కొన్నారు. దాని గురించి మాట్లాడటం అనవసరమని అని కూడా ఆయ‌న వాదించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి అధికారాన్ని కట్టబెడితే... ప్రజల కష్టాలు - కన్నీరు తుడిచి మంచి పాలనను అందిస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళతామని తెలిపారు. ఏపీకి అన్ని ర‌కాలుగా అన్యాయం చేసిన బీజేపీకి ఓటేస్తే.. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వారు ఏపీ ప్ర‌జ‌ల క‌న్నీళ్లు తుడిచి సుప‌రిపాల‌న అందిస్తార‌ట‌.