Begin typing your search above and press return to search.
మోడీ జేబులో నుంచి ఇవ్వరు కదా కన్నా!
By: Tupaki Desk | 29 Sep 2019 7:09 AM GMTరాజకీయంలో సవాలచ్చ ఉండొచ్చు. ప్రత్యర్థి పార్టీని అదే పనిగా విమర్శించటం తప్పేం కాదు. రాజకీయం అన్నాక అలాంటివేమీ ఉండకుండా ఉండదు కదా. అలా అని.. ఏది పడితే అది మాట్లాడేస్తే ఎలా? తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాటలు ఇదే రీతిలో ఉన్నాయి. ఎన్నికల వేళ.. రైతులకు ఏడాదికి రూ.12500 ఇస్తానని జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారని.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం ఇచ్చే రూ.6వేలకు.. మరో రూ.6,500 కలిపి రూ.12,500 ఇస్తామని చెబుతున్నారని.. ఇది అన్యాయమంటూ గుండెలు బాదేసుకుంటున్నారు.
జగన్ ఇచ్చే రూ.12,500లో సగం డబ్బు కేంద్రం ఇస్తున్నందున.. ఆ పథకానికి మోడీ పేరు కూడా పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వినేందుకు ఎంత సిల్లీగా ఉంది కన్నా మాటలు. ఎందుకంటే.. కేంద్రం ఇస్తున్న నిధులు ఎక్కడివి? కేంద్రానికి ఆదాయం ఏమైనా ప్రత్యేకంగా ఎక్కడి నుంచైనా వస్తుందా? రాష్ట్రాలకు వచ్చే ఆదాయంలో కేంద్రం తన వాటా తీసుకుంటుంది.
ఆ మాటకు వస్తే.. రాష్ట్రం నుంచి వచ్చే ఆదాయానికి.. తిరిగి వివిధ పథకాల రూపంలో కేంద్రం నుంచి వచ్చే నిధులకు సంబంధం ఉండదన్నది మర్చిపోకూడదు. అలాంటప్పుడు రాష్ట్రం నుంచి వచ్చే సొమ్ముల్ని బడాయిగా కేంద్రం ఇస్తుంటే.. ఆ డబ్బులకు రాష్ట్ర ప్రభుత్వం అంతకంటే ఎక్కువ మొత్తాన్ని ఇస్తున్న విషయాన్ని కన్నా ఎందుకు మర్చిపోతున్నారు?
రాష్ట్రాల నుంచి కాక కేంద్రానికి ప్రత్యేకంగా వచ్చే ఆదాయం ఎంత? దాన్లో రాష్ట్రాలకు ఇచ్చేదెంత? లాంటి లెక్కల్లోకి వెళితే.. తన జేబులో నుంచి ఇస్తున్నట్లుగా డాబు మాటల వెనుక అసలు నిజం ఇట్టే అర్థమవుతుంది. అలాంటప్పుడు కేంద్రం ఇచ్చే నిధులు మొత్తం కేంద్రం కష్టపడి సంపాదించినట్లుగా కన్నా బిల్డప్ వినేందుకు విచిత్రంగా అనిపించట్లేదు?