Begin typing your search above and press return to search.
విజయా డైరీ కన్నా హెరిటేజ్ ముఖ్యమా?
By: Tupaki Desk | 6 July 2018 1:47 PM GMTలోటు బడ్జెట్ తో కొత్తగా ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం.....అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు - రాజధాని నిర్మాణం.... నిరుద్యోగం....సకాలంలో కురవని వర్షాలు.....ఇటవంటి నేపథ్యంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రయినా..... ఖజానాలోని ప్రతి రూపాయి ఆచితూచి ఖర్చు చేస్తారు. ఖజానాలోని నిధులను పొదుపుగా వాడి....రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తారు. కానీ, `40 ఈయర్స్ ఇండస్ట్రీ` డైలాగ్ కు పేటెంట్ తీసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దీక్షలు...ధర్మపోరాటాల పేరుతో ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేయడం చంద్రబాబుకు అలవాటే. తన అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకు....ఏదో రకంగా షో చేయడం...ప్రచార కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను మభ్యపెట్టడంలో చంద్రబాబుకు సాటి మరెవ్వరూ లేరు. ఈ నేపథ్యంలోనే హ్యాపీ సండే కార్యక్రమం నిర్వహిస్తోన్న చంద్రబాబుపై ఏపీ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. మద్దతు ధర దక్కక...సకాలంలో వర్షాలు పడక....ఇబ్బందిపడుతోన్న రైతులను విస్మరించిన చంద్రబాబు..... హ్యాపీ సండే కార్యక్రమాలు నిర్వహించడం ఏమిటని కన్నా నిప్పులు చెరిగారు. చిత్తూరు విజయా డెయిరీని గాలికి వదిలేసిన చంద్రబాబు తన సొంత సంస్థ హెరిటేజ్ డెయిరీని అభివృద్ధిపథంలో నడిపించడం ఏమిటని మండిపడ్డారు.
ఏపీ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ప్రమాణ స్వీకారం చేసినప్పటి ....టీడీపీపై విరుచుకుపడుతోన్న విషయం తెలిసిందే. సందర్భానుసారంగా ఏపీ సీఎం చంద్రబాబుపై కన్నా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా - హ్యాపీ సండే కార్యక్రమంపై కన్నా మండిపడ్డారు. రైతుల సమస్యలను పక్కన బెట్టి చంద్రబాబు హ్యాపీగా ఎలా ఉంటారని కన్నా ప్రశ్నించారు. ఏపీ అవినీతి కోరల్లో చిక్కుకుందని కన్నా అన్నారు. చంద్రబాబు హయాంలో టీడీపీ నేతలు బరితెగించి అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇకనైనా....నయవంచన దీక్షలను ఆపివేసి రైతులను ఆదుకోవాలన్నారు. చిత్తూరు విజయా డైరీని గాలికొదిలేసిన చంద్రబాబు..‘హెరిటేజ్’ ను అభివృద్ధి చేసుకుంటున్నారని మండిపడ్డారు. చిత్తూరులోని చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కడప ఉక్కు ఫ్యాక్టరీపై సరైన స్పష్టత లేదని - అందుకే ముందుకు రాలేకపోతున్నామని అన్నారు. విశాఖ రైల్వేజోన్ అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని, కొంత సమయం పడుతుందని వివరణ ఇచ్చారు.