Begin typing your search above and press return to search.
బాబు..లోకేష్.....ఓ ఇసుకాసురుల కథ
By: Tupaki Desk | 17 Nov 2018 2:33 PM GMTఇళ్ల నిర్మాణాలకు ఉపయోగించే ఇసుకపై ఎవరు పన్ను విధిస్తారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకు వచ్చిన జీఎస్టీలాగే ఇసుకకు ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక పన్ను విధించే చర్యలు ఉన్నాయా....కేవలం ఇసుక తోటే ఇసకేస్తే రాలనంత సొమ్ములు చేసుకోవచ్చా. ఏమిటి ఇసుకాయాణం అనుకుంటున్నారా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ లో ఇసుకపై తెలుగుదేశం పార్టీ పన్ను విధిస్తున్నారట.
మళ్లీ ఇక్కడ ఒక ట్విస్ట్... ఇసుకపై పంచాయితీలు మున్సిపాలిటీలు - జిల్లాపరిషత్ లు - రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే పన్నులు విధిస్తాయని అందరూ అనుకున్నారు. దానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ లో ఇసుకపై చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు తెలుగుదేశం పన్ను విధిస్తున్నారని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారయణ మండిపడ్డారు. శనివారం సాయంత్రం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన - ఆయన తనయుడు లోకేష్ పైన తీవ్ర ఆరోపణలు చేశారు. వారిద్దరు తమ మంత్రివర్గ సహచరులతో కలసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని తీవ్రంగా మండిపడ్డారు.
రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని నిర్మాణం పేరుతో అమరావతి పరిసరాలలో రైతుల నుంచి వేలాది ఎకరాలు తీసుకున్నారని వాటిని సింగపూర్ కంపేనీలకు కట్టబెట్టారని తీవ్రంగా విమర్శించారు. రాజధాని నిర్మణం పేరుతో రైతుల నుంచి వేలాది ఎకరాలు తీసుకున్న చంద్రబాబు నాయుడు - ఆ భూములను రైతులే స్వచ్ఛందంగా ఇచ్చారంటూ అబద్దాలు చెప్తున్నారని - నిజానికి ఆ భూములను రైతుల నుంచి బలవంతంగా లాక్కొన్నారని కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ లా చేస్తానని - చంద్రబాబు నాయుడు ప్రకటించిన రాష్ట్రాన్ని బ్రిటీష్ ఆంధ్రప్రదేశ్ గా చేస్తున్నారని మండిపడ్డారు.
ఓటుకు నోటు కేసులో హైదారబాదు నుంచి పారిపోయి వచ్చిన చంద్రబాబు నాయుడు ఎంత అవినీతికి పాల్పడ్డారో ఆయన ఇల్లు చూస్తే తెలుస్తుందని కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు నాయుడు చేసింది ఏమి లేదని ఆయనను ఆంధ్రప్రదేశ్ ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు.