Begin typing your search above and press return to search.
గవర్నర్ గారు మీరు జోక్యం చేసుకోండి: కన్నా లక్ష్మీనారాయణ లేఖ
By: Tupaki Desk | 18 Jun 2020 4:30 PM GMTఆర్థికంగా వెనుకబడిన ఉన్నత సామాజిక వర్గాలకు రిజర్వేషన్ల అమలులో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో మీరు చొరవ తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు కన్నా లక్ష్మీనారాయణ లేఖ గురువారం రాశారు. రాష్ట్ర ప్రభుత్వం 10% ఈడబ్య్లూఎస్ రిజర్వేషన్లను అమలు చేయకపోవడంపై స్పందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీరు వల్ల కేంద్ర ప్రభుత్వం అందించిన 10% రిజర్వేషన్లను కోల్పోతున్నారని, రాష్ట్రంలో ఆర్థికంగా బలహీనమైన వర్గాల వారంతా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
దేశంలోని ఉన్నత కులాల ప్రజలు ఆర్థికంగా బలహీనమైన వర్గాల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని ఏపీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను రాష్ట్రంలో అమలు చేయడం లేదని, విద్యార్థులు ఉన్నత, వృత్తి విద్యా సంస్థలలో ప్రవేశంతో పాటు ఉపాధికి అనేక అవకాశాలను కోల్పోతున్నారని కన్నా పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ సామాజికవర్గాలకు చెందిన ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖలు రాసినా .. తమ విజ్ఞప్తులను పట్టించుకోలేదని విమర్శించారు. లక్షలాది మంది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 10% రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని లేఖలో గవర్నర్‌ను కన్నా లక్ష్మీనారాయణ కోరారు.