Begin typing your search above and press return to search.
టీడీపీ నేతలవి వృథా ఖర్చులు: కన్నా
By: Tupaki Desk | 7 Feb 2018 4:11 PM GMTప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ-టీడీపీ ల మధ్యో కోల్డ్ వార్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. బీజేపీతో పూర్తిగా కటీఫ్ చెప్పాలా...వద్దా....అన్న సంకట స్థితిలో టీడీపీ సతమతమవుతుంటే....మరోవైపు టీడీపీని బీజేపీ నేతలు టార్గెట్ చేస్తూ సూటిపోటి విమర్శలు చేస్తున్నారు. దీంతో, మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్లయింది టీడీపీ పరిస్థితి. టీడీపీ పాలనలో జరుగుతోన్న అక్రమాలపై బీజేపీ నేత సోము వీర్రాజు బహిరంగంగా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఏపీ సీఎం చంద్రబాబు - టీడీపీ నేతలపై కన్నా లక్ష్మీనారాయణ కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. గుంటూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ నేతలపై బీజేపీ నాయకుల మాటల యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. ఒకరి తర్వాత మరొకరు సందర్భానుసారంగా తమ మిత్రపక్షంపై సహేతుకమైన విమర్శలు చేస్తుండడంతో.....టీడీపీ నేతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. తాజాగా, చంద్రబాబుపై బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ చంద్రబాబు - టీడీపీ నేతలు వృథా ఖర్చులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అసలే లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని మరింత అప్పులపాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 2,500 కోట్లు మంజూరు చేసిందని, అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న రీతిలో పనులు నత్తనడకన సాగుతున్నాయని, కొన్ని నిర్మాణాలు అసలు ప్రారంభం కూడా కాలేదని మండిపడ్డారు. ఇప్పటివరకు ఇచ్చిన నిధులకు డీపీఆర్ ఇవ్వకుండా మళ్లీ నిధులు కావాలని అడిగితే ఎలా ఇస్తారని ఎద్దేవా చేశారు. సినిమా డైరెక్టర్లతో రాజధాని డిజైన్లు వేయించడం ఎంతవరకు సమంజసమని, రాజమౌళిని ఉద్దేశించి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మరి, కన్నా వ్యాఖ్యలపై టీడీపీ నేతల స్పందన ఎలా ఉంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది.