Begin typing your search above and press return to search.
రాజకీయాల బాటలో ఆ సంచలన హీరో?
By: Tupaki Desk | 12 Aug 2017 10:09 AM GMTఎప్పుడూ లేని రీతిలో ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా.. టాప్ హీరోలంతా రాజకీయాల మీద మనసు మళ్లుతుందన్నట్లుగా ఉంది. 2014 సార్వత్రిక ఎన్నికల ముందు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పేరిట రాజకీయ పార్టీని స్టార్ట్ చేయటం.. మరో రెండు.. మూడు నెలల్లో తాను సీరియస్ పాలిటిక్స్ వైపు వెళ్లనున్నట్లు ఈ మధ్యనే ప్రకటించటం తెలిసిందే.
టాలీవుడ్ ముచ్చట ఇలా ఉంటే కోలీవుడ్ లో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.. విశ్వ కథానాయుడిగా పేరున్న కమల్ హాసన్ లు పొలిటికల్ ఎంట్రీలు ఇచ్చే అవకాశం మీద హాట్ హాట్ చర్చలు సాగుతున్నాయి. మరో రెండు నెలల్లో వీరిద్దరి పొలిటికల్ ఎంట్రీ మీద పూర్తిస్థాయి క్లారిటీ వచ్చేయనున్నట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. శాండల్ వుడ్ లోనూ రాజకీయం మీద దృష్టిపెట్టారో సంచలన కథానాయకుడు.
విలక్షణమైన మేనరిజమ్ తో.. తనకు మాత్రమే సాధ్యమయ్యే కథాంశాలతో సినిమాలు తీసే ఉపేంద్ర రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఎప్పుడూ లేనిది ప్రస్తుత రాజకీయాలపై ఉపేంద్ర తన వాదనను సోషల్ మీడియాను వేదికగా చేసుకొని వినిపిస్తూ ఉండటంతో ఆయన రాజకీయ రంగ ప్రవేశం మీద కన్నడనాడలో తీవ్ర చర్చ సాగుతోంది.
ప్రధాని నరేంద్ర మోడీపై అదే పనిగా ప్రశంసిస్తూ ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్న ఉపేంద్ర.. బీజేపీలో చేరనున్నారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. సొంత పార్టీ పెడతారా? లేక.. బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా? అన్న అంశంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ రోజు సాయంత్రం ఆయన బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో భేటీ కానుండటం గమనార్హం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. తన పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన వివరాల్ని ఈ రోజు సాయంత్రం ఉపేంద్ర వెల్లడించే అవకాశం ఉందంటున్నారు. ఆయన బీజేపీలో చేరి.. మండ్య లోక్ సభ స్థానానికి బీజేపీ తరఫున బరిలోకి దిగే అవకాశం ఉందంటున్నారు. అయితే.. బీజేపీలో చేరతారా? పవన్ కల్యాణ్ మాదిరి సొంత పార్టీ పెట్టుకుంటారా? అన్న విషయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా.. ఈ సాయంత్రం ఆయన పొలిటికల్ ఎంట్రీ మీద క్లారిటీ వస్తుందన్న మాట జోరుగా వినిపిస్తోంది.