Begin typing your search above and press return to search.

జీవీఎల్ పై చెప్పు విసిరిన డాక్ట‌ర్ బ్యాక్ గ్రౌండ్ ఇది!

By:  Tupaki Desk   |   19 April 2019 4:51 AM GMT
జీవీఎల్ పై చెప్పు విసిరిన డాక్ట‌ర్ బ్యాక్ గ్రౌండ్ ఇది!
X
దేశ రాజ‌ధాని ఢిల్లీలోని బీజేపీ ప్ర‌ధాన కార్యాల‌యంలో నిర్వ‌హిస్తున్న మీడియా స‌మావేశంలో రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు మాట్లాడుతున్న వేళ‌.. అక్క‌డే ఉన్న ఒక డాక్ట‌ర్ (శ‌క్తి భార్గ‌వ‌) చెప్పు విస‌ర‌టం.. అది కాస్తా జీవీఎల్ ను తాక‌టం.. దీంతో ఆయ‌న షాక్ కు గురి కావ‌టం తెలిసిందే. బీజేపీ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగిన మీడియా మీట్ లో ఒక‌రు వ‌చ్చి చెప్పు విసిరిన వైనం సంచ‌ల‌నంగా మారింది.

చెప్పు విసిరిన డాక్ట‌ర్ ఎవ‌రు? ఆయ‌న బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? ఎందుకు చెప్పు విసిరారు? మోడీ మీద ఆయ‌న‌కు అంత మంట ఎందుకు? లాంటి ప్ర‌శ్న‌ల‌కు కొంత‌మేర స‌మాధానం చెప్పే ప‌రిస్థితి. ఉంది. జీవీఎల్ పైనే ఎందుకు చెప్పు విసిరారు? అన్న దానిపై స్ప‌ష్ట‌త రాన‌ప్ప‌టికీ.. బీజేపీ మీదా.. ప్ర‌ధాని మోడీ పాల‌న మీదా ఆయ‌న‌కు అంత ఆగ్ర‌హాం ఎందుకు? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం వెతికితే.. ఆస‌క్తిక‌ర అంశాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అవేమంటే..

+ ఉత్తర్‌ప్రదేశ్‌ లోని కాన్పూర్‌ కు చెందిన శక్తి భార్గవ మూడు భవనాలను కొనుగోలు చేసి.. తన బ్యాంకు ఖాతా నుంచి రూ.11.5 కోట్లు చెల్లించారు.

+ ఆ భవనాలను తనతో పాటు తన భార్య - పిల్లలు - బంధువుల పేర్ల మీద కొనుగోలు చేశారు. అయితే, వీటిని కొనుగోలుకు డబ్బు ఎలా వచ్చిందన్నదానిపై ఐటీ అధికారులకు ఆయన సమాధానం చెప్పలేకపోయారు.

+ లక్నో.. కాన్పూర్‌.. వారణాసిలోని ఆయన ఆస్తులపై 2018లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు.

+ ఆదాయ‌ప‌న్ను శాఖ నుంచి ఆయ‌న విచార‌ణ ఎదుర్కొంటున్నారు.

+ మరోవైపు, ఈ భవనాల విషయంలో తల్లిదండ్రులతో విభేదాలు ఉండ‌టం గ‌మ‌నార్హం.

+ ఆ మూడు భవనాల ఇష్యూలో భార్గవ మోసపూరితంగా వ్యవహరించినట్లు ఆయన తల్లిదండ్రులు ఇటీవల ఆరోపణలు చేశారు.

+ ఈ భవనాలను కొనుగోలు చేయటానికి ముందు అవి ఆయన తల్లిదండ్రుల పేరిటే ఉండ‌టం గ‌మ‌నార్హం.

+ భార్గ‌వ‌ మానసిక పరిస్థితి బాగోలేదని గ‌తంలో ఆయనకు లాయ‌ర్ గా పని చేసిన వ్య‌క్తి పేర్కొన‌టం విశేషం.

+ డాక్ట‌ర్ భార్గ‌వ‌కు లాయ‌ర్ గా ప‌ని చేసిన వ్య‌క్తి.. ఆయ‌న త‌ర‌ఫున ప‌ని చేయ‌కూడ‌ద‌ని డిసైడ్ అయ్యార‌ట‌.

+ భార్గ‌వ త‌న సోష‌ల్ మీడియా ఖాతాల్లో ప్ర‌ధాని మోడీని ఉద్దేశించి అదే ప‌నిగా విమ‌ర్శిస్తూ పోస్టులు పెట్టేవారు.