Begin typing your search above and press return to search.
#శ్రీనివాస్ కూచిభొట్ల: గ్రిల్లోట్ కు అరుదైన గౌరవం
By: Tupaki Desk | 11 Dec 2017 12:17 PM GMTఅమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవి చేపట్టాక అక్కడ జాత్యాహంకార దాడులు పెరిగిపోయిన సంగతి తెలిసిందే. అమెరికన్లకు ట్రంప్ లోకల్ సెంటిమెంట్ ను నూరిపోయడంతో అక్కడ ఉద్యోగాలు చేస్తున్నభారతీయులతో సహా ఇతర దేశస్థులపై కొంతమంది స్థానికులు విద్వేషపూరిత వ్యాఖ్యలు - దాడులు చేశారు. ముఖ్యంగా తమ ఉద్యోగాలను భారతీయులు ఎగరేసుకుపోతున్నారన్న భావన అమెరికన్లలో బలంగా నాటుకుపోయింది. ఈ నేపథ్యంలోనే ఏ ఏడాది ఫిబ్రవరిలో కాన్సాస్ లో ఇద్దరు భారతీయులపై జరిగిన కాల్పుల ఘటన పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. తెలుగు యువకుడు శ్రీనివాస్ కూచిభొట్లతో పాటు మరో భారతీయుడు అలోక్ మాదసానిపై ఓ మాజీ నేవీ ఉద్యోగి జాత్యాహంకార వ్యాఖ్యలు చేయడంతో పాటు కాల్పులకు తెగబడ్డాడు. ఆ ఉన్మాది దాడిలో శ్రీనివాస్ మరణించగా - అలోక్ గాయపడ్డాడు.
ఆ దాడిని అడ్డుకునేందుకు 24 ఏళ్ల అమెరికా యువకుడు గ్రిల్లోట్ ప్రాణాలకు తెగించి మరీ బుల్లెట్లకు అడ్డు నిలిచాడు. ఈ క్రమంలో గ్రిల్లెట్ ఛాతీలోకి ఒక బుల్లెట్ కూడా దూసుకెళ్లింది. దీంతో, గ్రిల్లోట్ పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. తాజాగా - గ్రిల్లోట్ కు టైమ్ మ్యాగజైన్ -2017 సాహసవీరుల జాబితాలో చోటు దక్కింది. ‘2017లో మనలో ఆశలు నింపిన 5గురు హీరోలు’’ అంటూ టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన జాబితాలో గ్రిల్లోట్ కు చోటు దక్కింది. తనకు ఈ అరుదైన గౌరవం దక్కడం పట్ల గ్రిల్లోట్ ఆనందం వ్యక్తం చేశాడు. ‘‘ ఆ దాడి జరుగుతున్న సమయంలో నేను చేతులు ముడుచుకుని కూర్చుని ఉంటే జీవితాంతం పశ్చాత్తాప పడుతూ ఉండేవాడిని.....నేను నేనుగా బ్రతకలేకపోయేవాడిని. మీ అందరి ఆశీస్సులు ఉండడం వల్లే నేను త్వరగా కోలుకోగలిగాను’’ అని గ్రిల్లోట్ పేర్కొన్నాడు. గ్రిల్లోట్ పై టైమ్ మేగజైన్ ప్రశంసలు కురిపించింది. కొద్ది నెలల క్రితం గ్రిల్లోట్ ను `ఎ ట్రూ అమెరికన్ హీరో` అనే బిరుదుతో హ్యూస్టన్ లోని ఇండో అమెరికన్ కమ్యూనిటీ గౌరవించింది. గ్రిల్లోట్ స్వస్థలం కాన్సాస్ లో అతడు సొంత ఇల్లు కొనుక్కునేందుకు లక్ష డాలర్ల నగదను విరాళాల రూపంలో సేకరించి అందజేసింది.