Begin typing your search above and press return to search.
అది విరిగిపోవడం వల్లే ఉమామహేశ్వరి మృతి చెందారా?
By: Tupaki Desk | 6 Aug 2022 4:45 AM GMTదివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి (57) ఆగస్టు 1న జూబ్లీహిల్స్ లోని తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును పోలీసులు అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు. ఈ మేరకు ఆమె భౌతిక కాయాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.
కాగా ఈ పోస్టుమార్టం నివేదికలో ఆమెది ఆత్మహత్యేనని వెల్లడైంది. ఉమామహేశ్వరి ఉరి పెట్టుకున్నప్పుడు తాడు గట్టిగా బిగించుకోవడంతో స్వర పేటిక విరిగిపోయిందని.. దీంతో ఆమె మృతి చెందారని తేలింది. ఈ మేరకు ఉస్మానియా ఆస్పత్రి ఫోరెన్సిక్ బృందం పోస్టుమార్టం రిపోర్టును జాబ్లీహిల్స్ పోలీసులకు అందజేసింది.
ఉమామహేశ్వరి అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఇది మిస్టరీ మరణం అంటూ వైఎస్సార్సీపీ నేతలు పెద్ద ఎత్తున రకరకాల ప్రచారాలు చేశారు.
చంద్రబాబు, లోకేష్ జూబ్లీహిల్స్ విలువైన ఆస్తి కోసం ఆమెను అసభ్యంగా తిట్టారని.. చేయి కూడా చేసుకున్నారని ఆరోపించారు. అంతేకాకుండా నందమూరి లక్ష్మీపార్వతి, విజయసాయిరెడ్డి, తదితరులు ఉమామహేశ్వరి మరణంపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు టీడీపీ నేతలు కూడా వైఎస్సార్సీపీ నేతలు శవ రాజకీయాలు చేస్తున్నారని, హత్యా రాజకీయాలు వైఎస్సార్సీపీకి మాత్రమే అలవాటని ప్రత్యారోపణలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు పోస్టుమార్టం నివేదిక అందింది. ఇందులో ఉమామహేశ్వరి కంఠానికి తాగు బిగుసుకోవడం వల్లే ఆమె మరణించారని స్పష్టమైంది. దీంతో ఇక వైఎస్సార్సీపీ విమర్శలకు చెక్ పడ్డట్టేనని అంటున్నారు.