Begin typing your search above and press return to search.
కాంతార వారి జీవితాల్లో వెలుగులు తెచ్చింది.. ఇది కదా అసలైన విజయం..!
By: Tupaki Desk | 22 Oct 2022 3:29 AM GMTఓ సినిమా హిట్ అంటే కమర్షియల్ లెక్కల్లో మాత్రమే చెబుతారు. కానీ ఒక సినిమా వల్ల ప్రభుత్వం కూడా ఒక కొత్త ప్రపోజల్ తెస్తే.. ఆ సినిమా విజయాన్ని ఎలా కొలవాలి. కమర్షియల్ గా అంటే అది వసూళ్లు చేసిన లెక్కలను బట్టి చెప్పొచ్చు. కానీ సినిమా వల్ల కొందరి జీవితాలు మారుతున్నాయి..
వారి జీవితాల్లో కొత్త వెలుగులు వచ్చేలా చేస్తే అదే అసలైన విజయం. ఇంతకీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇటీవల విడుదలై ఘన విజయాన్ని అందుకున్న కాంతార సినిమా వసూళ్లతో ఇండస్ట్రీలను షేక్ చేస్తుంటే ఆ సినిమాలో ప్రస్థావించిన అంశాలపై కర్ణాటక ప్రభుత్వం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంది.
కర్ణాటక ఆదివాసీ సంస్కృతిలో భూతకోల నృత్యం కూడా ఒకటి. దశాబ్ధాలుగా వీరి గురించి పట్టించుకున్న వారు లేరు. కానీ కాంతార సినిమాలో ప్రత్యేకంగా భూతకోల నృత్య ప్రదర్శన గురించి వివరణంగా చెప్పారు. అనాదిగా వస్తున్న ఆ సంప్రదాయాన్ని ఇప్పటికీ ఆదివాసీలు కొనసాగిస్తున్నారు.
అయితే ప్రభుత్వం తరపునుంచి వారికి ఎలాంటి సహకారం లేదు. కాంతార సినిమా చూసిన తర్వాత భూతకోల నృత్య కారులకు ఒక గుర్తింపు వచ్చింది. అందుకే కర్ణాటక ప్రభుత్వం 60 ఏళ్లు పై బడిన భూతకోల నృత్యకారులకు నెలకు 2000 రూపాయలు ఆర్ధిక సాయం చేయనున్నట్టు ఎంపీ పీసీ మోహన్ వెళ్లడించారు.
భూతకోల నృత్యకారులకు ఆర్ధిక సాయం అందించేందుకు ముందుకొచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి ఎంపీఎ పీసీ మోహన్ కృతజ్ఞతలు తెలిపారు. కాంతార సినిమా వల్లే ఇది జరిగిందని ప్రేక్షకులు చెప్పుకుంటున్నారు. సినిమా ప్రభావం ఎంత ఉంటుంది.
ఒక సినిమా వ్యవస్థలో మార్పుకి కారణం అవుతుంది అంటే కామెడీ అనుకుంటారు కానీ ఇలాంటివి జరిగినప్పుడే అది నిజం అని నమ్ముతారు. కాంతార సినిమా కన్నడలో కన్నా తెలుగులో వసూళ్లతో విజృంభిస్తుంది. వీకెండ్ లో కాదు వీక్ డేస్ లో ముఖ్యంగా ఈవెనింగ్ షోస్ లో అన్నిచోట్ల హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. రిషబ్ శెట్టి కథ, దర్శకత్వం వహించడమే కాకుండా హీరోగా నటించిన కాంతార సినిమా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.