Begin typing your search above and press return to search.
కలలో కూడా ఊహించని రీతిలో తయారైన కపిల్.. ఎందుకిలా?
By: Tupaki Desk | 17 Oct 2021 4:56 AM GMTదేశంలో క్రికెటర్లకు కొదవలేదు. కానీ.. హర్యానా హరికేన్ గా ఫేమస్.. జెంటిల్ మ్యాన్ గేమ్ లో అసలుసిసలు జెంటిల్ మెన్ గా కనిపించే క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్. చాలామంది స్టార్ క్రికెటర్లకు లేని ఇమేజ్ ఆయన సొంతం. భారత్ కు తొలి వరల్డ్ కప్ ను అందించిన లెజెండరీ క్రికెటర్ ఆయన. అలాంటి ఆయన చాలా జెంటిల్ గా కనిపిస్తారు. తన తీరుతో ఆయన మరింత ఆకట్టుకుంటారు.
అలాంటి కపిల్ దేవ్ తన తీరుకు ఏ మాత్రం సరిపోని రీతిలో తయారు కావటం.. కలలో కూడా ఊహించని డ్రెస్సింగ్ వేయటమే కాదు.. వెకిలి చేష్టలతో ఇతను కపిల్ దేవేనా? ఎందుకింత రచ్చ? అన్నట్లుగా తయారయ్యారు. అయితే.. ఇదంతా చేసింది ఆయన ఒక వాణిజ్య ప్రకటన కోసం. ప్రముఖ క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపు యాప్ 'క్రెడ్' కోసం సరికొత్త అవతారాల్ని ఎత్తారు.
మిగిలిన వాణిజ్య ప్రకటనలకు భిన్నంగా క్రెడ్ యాడ్స్ ఉండటం తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ బాడీ లాంగ్వేజ్ ను ఇమిటేట్ చేస్తూ.. సదరు యాడ్ లో కపిల్ వ్యవహరించిన తీరు ఫన్నీగా ఉందని చెప్పాలి. అయితే.. ఒక వాణిజ్య ప్రకటనలో నటించటం కోసం.. తనకున్న హుందాతనం ఇమేజ్ ను పణంగా పెట్టాల్సిన అవసరం ఉందంటారా? అన్నది ప్రశ్న. కొందరు ఈ యాడ్ చూసినంతనే వావ్.. అమేజింగ్ అని వ్యాఖ్యానిస్తుంటే.. మరికొందరు మాత్రం ఆయన యాడ్ చేసిన వైనాన్ని తప్పు పడుతున్నారు.
కపిల్ కూడా ఇలా ఉంటారా? ఎంత యాడ్ అయితే మాత్రం.. ఎలా పడితే అలా చేయటానికి ఓకే చెప్పటం ఏమిటి? ఇన్నేళ్లుగా సంపాదించుకున్న ఇమేజ్ ను ఒక్క యాడ్ తో మార్చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా? అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే క్రెడ్ యాప్ కోసం భిన్నమైన రీతిలో కనిపించిన సెలబ్రిటీలు ఉన్నారు. అందులో రాహుల్ ద్రవిడ్.. వెంకటేశ్ ప్రసాద్.. ఒలింపిక్స్ స్వర్ణ విజేత నీరజ్ చోప్రా లాంటి వారున్నారు. తాజాగా కపిల్ వారి సరసన చేరారని చెప్పాలి.