Begin typing your search above and press return to search.
షూస్ చినిగిపోతే ఒట్టికాళ్లతో బౌలింగ్ వేసే వారంట
By: Tupaki Desk | 23 March 2016 4:55 AM GMTకరిగిపోయిన కాలం గుర్తుకు తెచ్చుకుంటే కొన్నిసార్లు విస్మయం కలగటమే కాదు.. నిజంగా అలాంటివి జరిగేవా? అన్న సందేహం కలగటం ఖాయం. చెప్పే వ్యక్తి కాని విశ్వసనీయవ్యక్తి కాకుంటే.. అతడు చెప్పేదంతా అబద్ధమేమో అనుకునే అవకాశం ఉంది. క్రికెట్ ఆట ఎంతలా మారిపోయిందన్న విషయాన్ని నాటి దిగ్గజ క్రికెటర్లలో ఒకరైన కపిల్ దేవ్ గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్న స్మృతుల్ని వింటే..ఆ రోజుల్లో పరిస్థితులు మరీ అంతలా ఉండేవా? అన్న ఆశ్చర్యమే కాదు.. షాకింగ్ గా ఉండటం ఖాయం. ఇప్పుడున్న క్రికెట్ ఆట పూర్తిగా మారిపోయిందని.. గతానికి.. వర్తమానానికి ఏ మాత్రం సంబంధం లేదని చెబుతున్నారు కపిల్ దేవ్. నిజమే.. ఆయన మాటలు వింటే నిజమే కదా అనిపించక మానదు. పాక్.. న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా గతంలో క్రికెట్ ఆట ఎలా ఉండేది..? ఆటగాళ్లు ఎన్ని ఇబ్బందులకు గురయ్యేవారు? వారికున్న వసతులు ఏమిటి? అన్నవి చూస్తే నోట మాట రాకుండా ఉండిపోతుంది.
ఇప్పటి రోజుల్లో గ్రౌండ్ ను ఎలా కావాలంటే అలా తయారు చేస్తున్నారని.. గతంలో అలాంటి పరిస్థితి ఉండేది కాదని.. గ్రౌండ్ ఎలా ఉంటే అలా ఆడాల్సి వచ్చేదని.. చాలా సందర్భాల్లో ఆట మధ్యలో మంచినీళ్లు కూడా అందుబాటులో ఉండేవి కావని చెప్పుకొచ్చారు. చాలా సందర్భాల్లో ప్లాస్టిక్ బక్కెట్లలో నీళ్లను తాము మోసుకొచ్చి.. అందుబాటులో ఉంచుకునేవాళ్లమని కపిల్ చెప్పుకొచ్చారు.
ఈ రోజు క్రికెటర్లకు అందుబాటులో ఉన్న చాలా వస్తువులు అప్పట్లో ఉండేవి కాదని.. అంతదాకా ఎందుకు షూస్ ఒకవేళ చినిగిపోతే.. వాటిని వదిలేసి.. ఒట్టి కాళ్లతోనే పరుగులు పెడుతూ బౌలింగ్ చేయాల్సి ఉండేదని గతాన్ని గుర్తు చేసుకున్నారు. తన షూస్ చినిగిపోయిన పలు సందర్భాల్లో తాను ఒట్టి కాళ్లతో పరుగులు దీస్తూ బౌలింగ్ వేసిన రోజులున్నాయని చెప్పుకొచ్చారు. కపిల్ మాటలు వింటే విస్మయంగా అనిపించవు? నిజమే.. కాలంతో పాటు క్రికెట్ ఎంతలా మారిపోయింది?