Begin typing your search above and press return to search.
సీఎంకు దిమ్మ తిరిగే షాకిచ్చి..దీవించమన్నాడు
By: Tupaki Desk | 9 May 2017 7:51 AM GMTదేశంలో పార్టీలు ఎన్ని ఉన్నా.. తమది చాలా భిన్నమైన పార్టీగా చెప్పుకుంటారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. ఆయన మాటలకు తగ్గట్లే.. ఇప్పుడా పార్టీలో చోటు చేసుకున్న అంతర్యుద్ధ పరిణామాలు ఉన్నాయి. మరే రాజకీయ పార్టీలో లేని విధంగా.. అధినేత మీద తిరుగుబాటు బావుటా ఎగురవేయటమే కాదు.. షాకిచ్చి.. ఆశీర్వదించమని చెప్పటం ఆమ్ పార్టీ నేతలు మాత్రమే చేయగలరేమో?
పార్టీ నుంచి సస్పెండ్ అయిన కపిల్ మిశ్రా తన మాటలతో ఢిల్లీ ముఖ్యమంత్రి.. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేతకు షాకుల మీద షాకులిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన అవినీతి ఆరోపణలపై మరోసారి గళం విప్పారు. బహిరంగ లేఖతో ఆయన తనదైన శైలిలో రియాక్ట్ అవుతూ.. కేజ్రీవాల్ జీ.. నేను మీపైనా.. మీ పార్టీ నేతలపైనా కేసు పెట్టేందుకు వెళుతున్నా.. నన్ను దీవించగలరంటూ ఆయన చెబుతున్న మాటలు చీపురు పార్టీలో కొత్త కలకలాన్ని రేపుతున్నాయి. ఒకనాటి తన అధినేత అవినీతిపై సీబీఐకి కంప్లైంట్ చేయనున్నట్లుగా వెల్లడించారు.
సీబీఐకి తాను అన్ని విషయాలు చెప్పేస్తానన్న ఆయన.. తనను అసెంబ్లీ నుంచి పంపించాలని ప్రయత్నిస్తున్నారని.. దమ్ముంటే తనపై ఎన్నికల్లో పోటీ చేయాలంటూ కేజ్రీవాల్ కు సవాలు విసిరారు. ఢిల్లీలోని ఏ ప్రాంతం నుంచైనా తాను పోటీకి సిద్ధమని.. ఈ పోటీలో గెలుపు కేజ్రీవాల్ ది అయితే.. తాను పదవికి రాజీనామా చేస్తానన్నారు.
కేజ్రీవాల్ గురించి తనకు పదిహేనేళ్లుగా తెలుసి.. నిజానిజాల్నీ దర్యప్తులో తేలయాన్న మిశ్రా.. లాయర్ ను పెట్టుకోవటానికి కూడా తన దగ్గర డబ్బుల్లేవన్నారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రూ.2కోట్ల లంచం తీసుకుంటూ ఉండగా తన కళ్లతో తాను చూసినట్లుగా కపిల్ మిశ్రా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏమైనా.. ఓవైపు అధినేతకు దిమ్మ తిరిగేలా షాకిస్తూనే.. మరోవైపు తాను వేయబోయే దెబ్బలు విజయవంతం అయ్యేలా తనను దీవించమని అడగటం ఆమ్ ఆద్మీపార్టీలోనే ఉంటుందేమో?