Begin typing your search above and press return to search.
ఆ సీఎం కాలర్ పట్టుకొని తీహార్ జైలుకు
By: Tupaki Desk | 15 May 2017 5:43 AM GMTఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి మహా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పటికున్న సమస్యలు సరిపోవన్నట్లుగా ఆయనపై వెల్లువెత్తిన ఆరోపణలు ఇప్పుడు మరింత ఇబ్బందికరంగా మారాయి. షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి అక్రమంగా నిధులు సేకరించారని.. ఆయన అత్యంత అవినీతిపరుడిగా ఆరోపిస్తూ.. ఆప్ బహిష్కృత నేత.. మాజీ మంత్రి కపిల్ మిశ్రా తీవ్ర ఆరోపణలు చేశారు.
కేజ్రీవాల్ అవినీతిపరుడని.. హవాలా లావాదేవీలు.. విరాళాలు.. షెల్ కంపెనీల ఏర్పాటు.. ఐటీ.. ఎన్నికల కమిషన్‌కు నిజాలు వెల్లడించకుండా దాచిపెట్టారని.. ఆయన అవినీతిపరుడని తేలిపోయిందని.. ఆయన తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కేజ్రీవాల్ కానీ రాజీనామా చేయకుంటే ఆయన్ను కాలర్ పట్టుకొని తీహార్ జైలుకు ఈడ్చుకుపోతానని హెచ్చరించారు. నాలుగు మోసపూరిత షెల్ కంపెనీలకు సంబంధించి ఐటీ విభాగం నోటీసులు పంపిన విషయాన్ని వెల్లడించారు. వందల షెల్ కంపెనీల్ని ఆయన నడుపుతున్నట్లుగా తీవ్ర ఆరోపణలు చేశారు.
నాలుగు మోసపూరిత షెల్ కంపెనీలకు సంబంధించి ఐటీ విభాగం కేజ్రీవాల్‌కు నోటీసులు పంపిందని.. నిజానికి ఆయన సన్నిహితులంతా వందలాది షెల్ కంపెనీలు నడుపుతున్నట్లుగా ఆరోపించారు. అంతేకాక మరిన్ని ఆరోపణలు చేసిన కపిల్ మిశ్రా.. "ఆప్ ఎమ్మెల్యేలు శివచరణ్ గోయల్.. నరేశ్ యాదవ్ లు కూడా షెల్ కంపెనీల్ని నడుపుతున్నారు. ఢిల్లీలోని ఓ యాక్సిస్ బ్యాంకు బ్రాంచ్ ద్వారా లావాదేవీలు నడిపారు. నోట్ల రద్దు తర్వాత ఈ బ్రాంచ్ మీదనే దాడులు జరిగాయి. నరేశ్ యాదవ్ సతీమణి ప్రీతి యాదవ్‌కు కూడా బోగస్ కంపెనీలతో సంబంధాలున్నాయి. శివచరణ్ గోయల్.. ఆయన సతీమణి కూడా పెద్ద ఎత్తున షెల్ కంపెనీలు పెట్టారు. వీటి ద్వారా నల్లధనాన్ని ఆప్ కు తరలించారు. స్వదేశం.. విదేశాల నుంచి వచ్చిన విరాళాలకు సంబంధించి పెద్ద స్కాం జరిగింది. సోమవారం వీటి వివరాల్ని బయటపెడతా. ప్రియ బన్సల్ అనే మహిళ నుంచి 2014-15.. 2015-16 లో రూ.90లక్షలు విరాళం వచ్చింది.. కానీ ఆమె కట్టిన ఆదాయపన్ను మాత్రం రూ.4వేలే. 2014-15 లో ఆప్ ఖాతాలో రూ.65 కోట్లు ఉన్నా.. ఎన్నికల కమిషన్ కు మాత్రం రూ.32.4కోట్లు మాత్రం ఉన్నట్లు పేర్కొంది" అంటూ డీటైల్డ్ గా చెబుతున్న వివరాలతో ఆమ్ ఆద్మీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మరి.. కపిల్ మిశ్రా ఆరోపణలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారటమే కాదు.. ఢిల్లీ రాజకీయాల్ని హాట్ హాట్ గా మార్చేస్తున్నాయి.