Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ లో `అన్ ఫాలో` కలకలం రేపిందే!
By: Tupaki Desk | 21 Aug 2017 11:43 AM GMT150 ఏళ్ల ఘన చరిత్ర గల పార్టీ కాంగ్రెస్.. ఒకే ఒక్క వ్యక్తి హవా ముందు కొట్టుకుపోయింది. నాయకుడు లేక విలవిల్లాడుతూ.. పునర్వైభవం కోసం కాంగ్రెస్ పోరాడుతూనే ఉంది. నాయకత్వ లేమి ఆ పార్టీని తీవ్రంగా వేధిస్తోంది. భావి నాయకుడిగా భావిస్తున్న రాహుల్ గాంధీ అపరిపక్వత కూడా పెద్ద మైనస్! ఇదే సమయంలో ప్రధాని మోదీ హవా నానాటికీ పెరుగుతోంది. దీంతో కాంగ్రెస్ లోని సీనియర్లు.. ఒక్కొక్కరు తలో దారి వెతుక్కంటున్నారు. ఇప్పటికే చాలా మంది నాయకులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక ఇదే కోవలో కాంగ్రెస్ కు మరో సీనియర్ నేత షాకిచ్చారు.
గుజరాత్ లో కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్ సిన్హ్ వాఘేలా ఇదేవిధంగా రాహుల్ గాంధీ ట్విట్టర్ పేజీని మే నెలలో 'అన్ ఫాలో' కొట్టారు. గత నెలలో ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పే యోచనలో సీనియర్లు ఉన్నారు. రేపో మాపో ఒక్కొక్కరుగా కాంగ్రెస్ కు హ్యాండ్ ఇవ్వడం.. గ్యారెంటీ అనే సంకేతాలు ఇప్పటికే ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ నేత - కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ సిబ్బంది అనుకోకుండా ట్విట్టర్ లో పార్టీ అధికారిక పేజీని - ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేజీని 'అన్ ఫాలో' కొట్టడం దుమారం రేపింది.
కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చిందా? ఆయన కూడా హస్తానికి గుడ్ బై చెప్పబోతున్నారా? అన్న ఊహాగానాలు వినిపిస్తున్నా యి. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత - సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వివరణ ఇచ్చారు. తన సిబ్బంది అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ - రాహుల్ గాంధీ ట్విట్టర్ పేజీలను 'అన్ ఫాలో' కొట్టారని - వెంటనే జరిగిన పొరపాటును గుర్తించి తిరిగి ఆ పేజీలను అనుసరించడం మొదలుపెట్టారని సిబల్ తెలిపారు. మరో సీనియర్ నేత పి. చిదంబరం కూడా కాంగ్రెస్ - రాహుల్ అధికారిక పేజీల (@INCIndia, @OfficeOfRG)ను 'అన్ ఫాలో' కొట్టినట్టు వార్తలు వచ్చాయి. సోమవారం ఉదయం చూస్తే చిదంబరం ట్విట్టర్ ఖాతాలు ఈ రెండు పేజీలను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నది.