Begin typing your search above and press return to search.

హౌడీ, మోదీ స్నేహ ఫలితమీదేనా? కపిల్ సిబల్ ఫైర్

By:  Tupaki Desk   |   23 Oct 2020 1:00 PM GMT
హౌడీ, మోదీ స్నేహ ఫలితమీదేనా? కపిల్ సిబల్ ఫైర్
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఇవాళ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్, డెమోక్రాటిక్ అభ్యర్థి బైడెన్ మధ్య ముఖాముఖీ జరిగింది. ఈ సందర్భంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భారత్ లో కాక పుట్టిస్తోంది. భారత దేశ గాలి మురికిగా ఉందని ట్రంప్ అన్నారని ఆయనతో మీరు చేసిన స్నేహానికి ఫలితం ఇదేనా అంటూ కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ విమర్శించారు. కరోనా కేసుల మరణాల్లో భారత గోప్యత వహిస్తోందని ట్రంప్ గతంలోనూ వ్యాఖ్యానించారని ఈ సందర్భంగా కపిల్ సిబాల్ గుర్తు చేశారు.

గురువారం జరిగిన కార్యక్రమంలో అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన ట్రంప్‌, జోబిడెన్‌ సంవాదంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్యారిస్‌ వాతావ‌ర‌ణ ఒప్పందం నుంచి త‌ప్పుకోవ‌డానికి కార‌ణాలు వెల్లడించిన ట్రంప్‌ తన నిర్ణయం సరైనదేనని సమర్థించుకున్నారు. గమనిస్తే చైనా దేశం రోత రోత గా ఉంది.

ర‌ష్యా, ఇండియా దేశాల్లో గాలి మురికిమయం అయిందని ఆయన ఆరోపించారు. దాని వ‌ల్లే పారిస్ ఒప్పందం నుంచి తప్పుకున్నట్లు పేర్కొన్నారు. పారిస్ ఒప్పందానికి క‌ట్టుబ‌డి మిలియ‌న్ల సంఖ్యలో ఉద్యోగాల‌ను కోల్పోలేన‌ని, వేలాది కంపెనీల‌ను మూసివేయ‌లేమ‌ని ఈ సందర్భంగా ట్రంప్ పేర్కొన్నారు. చైనా, భారత్‌ కరోనా మరణాల వాస్తవాలు దాచాయని ట్రంప్‌ విమర్శలు చేసిన నేపథ్యంలో దీనిపై కపిల్‌ సిబల్‌ ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. ఎంతో స్నేహంగా మెలిగితే భారత్ లో మురికి గాలి అంటూ ట్రంప్ కామెంట్స్ చేశారని హౌడీ, మోదీ కార్యక్రమం ఫలితం ఇదేనా అని ఆయన విమర్శించారు.