Begin typing your search above and press return to search.
బాహుబలి పీఎం వైరస్ ను అడ్డుకోలేకపోయారు ...!
By: Tupaki Desk | 1 Jun 2020 6:00 AM GMTదేశంలో రోజురోజుకి వైరస్ పాజిటివ్ కేసులు పెరిగి పోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేసులున్న దేశాల జాబితాలో భారత్ 7 వ స్థానంలో ఉంది. ఇదే సమయాల్లో లాక్ డౌన్ నుండి భారీగా సడలింపులు ఇవ్వడంతో గతంలో కంటే ఇప్పుడు పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ బాహుబలి పీఎం వైరస్ కట్టడిలో విఫలం అయ్యారంటూ విమర్శలు చేసారు.
తాజాగా రెండోసారి ప్రధాని నరేంద్ర మోడీ ఏడాది పాలన పూర్తి చేసుకోవడం పై కపిల్ సిబల్ స్పందిస్తూ..చైనా, నేపాల్ సరిహద్దు వివాదం పై ప్రధాని మోడీ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బాహుబలి ప్రధాని కరోనా ను ఎదుర్కోలేక..దేశాన్ని కష్టాల్లోకి నెట్టారని, కేంద్ర ప్రభుత్వం వైరస్ ను మహమ్మారిగా ప్రచారం చేయడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదంటూ విమర్శలు కురిపించారు.
అలాగే, పీఎం కేర్స్ ఫండ్ వివరాల్ని బహిర్ఘతం చేయాలని డిమాండ్ చేశారు. వలస కూలీలు తమ గమ్య స్థానాలకు చేరేందుకు ఆకలితో అలమటిస్తూ, నడుచుకుంటూ వెళ్లిన వారు ప్రాణాలు కోల్పోయారని సిబల్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం వైరస్ కట్టడి పై చర్యలు తీసుకోకుండా ..లాక్ డౌన్ ముందుకు లాక్ డౌన్ తరువాత కేంద్రం కరోనా కేసుల్ని ధృవీకరించడమే పనిగా పెట్టుకుందని చెప్పుకొచ్చారు. బాహుబలి సంక్షోభాన్ని ఎదుర్కోలేకపోయారని ఆరోపించిన సిబల్..వైరస్ సంక్షోభంలో మరణించిన కార్మికులకు ఎంత ఎక్స్ గ్రేషియా ఇచ్చారో చెప్పాలని అన్నారు.