Begin typing your search above and press return to search.
కేసీఆర్ చేసిన స్కాం బయటపెడతాడంట!
By: Tupaki Desk | 12 Sep 2018 6:37 AM GMTఎవరైనా ఏదైనా తప్పు చేస్తే ఏం చేయాలి? వెంటనే ఖండించాలి. ఆధారాలు చూపించి.. ఇంత దుర్మార్గం చేస్తావా? అని ప్రశ్నించాలి. జాతి ప్రయోజనాల్ని దెబ్బ తీసేలా వ్యవహరిస్తే.. అస్సలు వదిలిపెట్టకూడదు. కానీ.. అలా చేయకుండా.. ఏళ్లకు ఏళ్లుగా నోరు మూసుకొని ఉండటం ఒక ఎత్తు అయితే.. ఇప్పుడో ఘటన జరిగిన తర్వాత దాన్ని చూపించి.. ఇదేం స్కాం.. కేసీఆర్ ది మహా స్కాం. ఆ వివరాలు బయటపెడతానని చెప్పటంలో అర్థం లేదనే చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి మాటలే చెబుతున్నారు టీజేఎస్ నేత కపిలవాయి దిలీప్ కుమార్.
విదేశాలకు అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయిన కాంగ్రెస్ నేత.. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉదంతం నేపథ్యంలో దిలీప్ కుమార్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సహారా కేసుపై సీబీఐ విచారణ ఎందుకు చేస్తుందో? ఈఎస్ ఐ కుంభకోణంలో కేసీఆర్ ఎందుకు భాగస్వామ్యులయ్యారో అన్ని విషయాల్ని తాను బయటపెడతానని వ్యాఖ్యానించారు.
తప్పులు చేసినప్పుడు.. వాటికి సంబంధించిన వివరాలు తెలిసిన తర్వాత వాటిని ప్రకటించాల్సిన అవసరం ఉంది. కానీ.. అలాంటిదేమీ లేకుండా జగ్గారెడ్డి ఉదంతం తెర మీదకు వచ్చాక కేసీఆర్ కుంభకోణాలంటూ ఆరోపణలు.. విమర్శలు ఎక్కుపెట్టటంలో అర్థం లేదన్న వాదన వినిపిస్తోంది.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. కేంద్ర మంత్రిగా కేసీఆర్ వ్యవహరించినప్పుడు ఆయన అధికార బృందంలో కపిలవాయి దిలీప్ ముఖ్యపాత్ర పోషించారు. అలాంటి ఆయన కేసీఆర్ తప్పుల్ని ఎత్తి చూపిస్తానని చెప్పటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రవి అనే ఎన్నారై పార్టీకి విరాళంగా డబ్బు పంపారని చెప్పారు. కేసీఆర్ లా తాము లక్షలు.. కోట్లు మింగలేదని.. ఆ వివరాలన్నీ తాను బయటపెడతానని చెప్పారు. మరి.. కపిలవాయి ఏం బయటపెట్టనున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.