Begin typing your search above and press return to search.
చంద్రబాబు గెలిచే వరకు అరగుండు, అరమీసం .. !
By: Tupaki Desk | 18 Nov 2021 5:32 AM GMTనెల్లూరు కార్పోరేషన్‌తో పాటు 12 మున్సిపాలిటీ, నగరపంచాయతీలకు ఎన్నికలు జరుగగ నిన్న ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఏక మొత్తంగా 54 డివిజన్లకు 54 డివిజన్లను వైసీపీ కైవసం చేసుకుంది. టీడీపీ మొత్తం ఖాళీ అయింది. ఒక్కటంటే ఒక్క చోట కూడా విజయం సాధించలేకపోయింది. అయితే వైసీపీ అక్రమాలతో ఈ ఎన్నికల్లో గెలిచిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
49, 50వ డివిజన్లలో టీడీపీని ఓడించేందుకు వైసీపీ ఏకంగా 3 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని టీడీపీ నేత కప్పిర శ్రీనివాసులు వింత నిరసనకు దిగారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే టీడీపీ నేత కప్పిర శ్రీనివాసులు అరగుండు గీయించుకున్నారు, అరమీసం తీయించుకున్నారు. ఈ వింతైన వేషంతోపాటు, మెడలో పలక తగిలించుకున్నారు. జగన్ పోవాలి, బాబు రావాలి అంటూ దానిమీద రాసుకున్నారు. మంత్రి, ఆయన అనుచరులు, ఇతర నాయకులు టీడీపీ ఓటమికోసం కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపణలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలిచి, ముఖ్యమంత్రి అయ్యే వరకు ఈ దీక్షలో ఉంటానని ప్రకటించారు టీడీపీ నేత కప్పిర శ్రీనివాసులు. మొత్తమ్మీద నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ విజయం తర్వాత టీడీపీ చేపట్టిన ఈ నిరసన సంచలనంగా మారింది. అరగుండు, అరమీసంతో టీడీపీ నాయకుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైసీపీ నాయకుల తీరు మారాలని, ఏకపక్షంగా ఎన్నికలు జరిపారని అన్నారాయన. మళ్లీ జనరల్ ఎన్నికలు జరిగే వరకూ ఇలాగే ఉంటానని శపథం చేశారు.