Begin typing your search above and press return to search.
కాపు సీఎం... పవన్ ని దెబ్బేసే ప్లాన్ ఎవరిది...?
By: Tupaki Desk | 2 Dec 2022 10:32 AM GMTఏపీలో కుల సంకుల సమరం ఇపుడు జోరుగా సాగుతోంది. ఏపీలో రాజకీయం అంటే కులాల లెక్కలు అని చాలా కాలంగా రుజువు అవుతున్న విషయం. ఇక వచ్చే ఎన్నికల్లోనూ అదే రకమైన పరిస్థితి ఉంటుంది అని అంతా నమ్ముతున్నారు. ఇక ఏపీలో కాపులకు ముఖ్యమంత్రి పదవి ఈసారి దక్కి తీరాల్సిందే అన్న డిమాండ్ ఉంది.
ఏపీలో అత్యధిక ఓటు బ్యాంక్ గా కాపులు ఉన్నారు. వారు తలచుకుంటేనే ఏ రాజకీయ పార్టీ అయినా అందలం ఎక్కుతుంది. దాంతో ఇపుడు అన్ని పార్టీలు కాపులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటిదాకా కమ్మలు, రెడ్లు, బ్రాహ్మణులు, వైశ్యులు, దళితులు, వెలమలు కూడా ఏపీలో ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ మద్రాస్ స్టేట్ లో కానీ ఆ మీదట ఏర్పడిన ఆంధ్రాలో కానీ ఉమ్మడి ఏపీలో విభజన ఏపీలో కానీ కాపులు ముఖ్యమంత్రులు కాలేకపోయారు.
కాపులకు ముఖ్యమంత్రి పదవి దక్కాలని అప్పట్లో కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ లాంటి వారు కృషి చేశారు. అలాగే సినీ రంగం నుంచి దాసరి నారాయణరావు చిరంజీవి లాంటి వారు ప్రయత్నాలు చేసి విరమించుకున్నారు. ఇపుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూపంలో వారికి ఒక అవకాశం వచ్చింది. మరి కాపులంతా గంపగుత్తగా జనసేన వైపు మళ్ళితే తమ గతేమి కానూ అన్న ఆలోచన ఆందోళన మిగిలిన పార్టీలలో ఉంది. వైసీపీ అయితే కాపులను ఒక వైపు దువ్వుతూనే బీసీలను కూడా అక్కున చేర్చుకుంటోంది.
తెలుగుదేశానికి బీసీల పార్టీగా ముద్ర ఉంది. కానీ 2019 ఎన్నికల తర్వాత వైసీపీతో కలసి ఆ ఓట్లను షేర్ చేసుకోవాల్సి వస్తోంది. దాంతో కాపుల ఓట్లు కీలకం అవుతున్నాయి. ఈ క్రమంలో కాపుల డిమాండ్ వారి సుదీర్ఘకాలమైన ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతోంది అన్న ప్రచారం అయితే సాగుతోంది. అదేంటి అంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే సీఎం పదవిని కాపులకు కేటాయిస్తారు అని అంటున్నారు.
నిజానికి ఇందులో నిజమెంత ఉందో ఎవరికీ తెలియదు. చంద్రబాబు తానుగా సీఎం పదవిని వదులుకోవడానికి ఎపుడూ అంగీకరించరు అని అంటారు. ఆయన తరువాత లోకేష్ ఆ పదవిలోకి రావాలని బాబు ఆలోచన అని చెబుతారు. ఇక గత ఏడాది జరిగిన అసెంబ్లీ సమావేశాల వేళ చంద్రబాబు తాను మళ్లీ సీఎం గానే అసెంబ్లీలో అడుగుపెడతాను అని ఒక భీషణ ప్రతిన చేశారు. దాంతో పాటు ఏపీని అభివృద్ధి చేసే సత్తా తనకు ఉందని బాబు గట్టిగా చెప్పుకుంటున్నారు.
జనాలు కూడా అభివృద్ధి కోణం లో నుంచి ఆలోచిస్తే బాబుకే ఓటు వేయాలి. కానీ ఇపుడు కుల సమీకరణలను ముందుకు తెచ్చి కాపులకు సీఎం పదవి అంటే కనుక టీడీపీకీ అది రాజకీయంగా సూపర్ హిట్ కావచ్చేమో కానీ చంద్రబాబు సీఎం కాని గెలుపు ఒక గెలుపేనా అన్న చర్చ అయితే తమ్ముళ్లల్కు వస్తుంది. అన్నింటికీ మించి ఒక బలమైన సామాజికవర్గం తెలుగుదేశాన్ని సొంతం చేసుకుని దశాబ్దాలుగా వెన్నంటి నడుస్తోంది. ఆ సామాజికవ్ర్గం కూడా ఈ ప్రతిపాదన పట్ల గుర్రుగా ఉండే అవకాశాలు ఉంటాయి.
వారి సహాయ నిరాకరణ కనుక ఉంటే అసలుకే ఎసరు వస్తుంది. అయితే టీడీపీ వ్యూహాత్మకంగా ఈ ప్రతిపాదన చేసే అవకాశం ఉందని అంటున్నారు. కాపులకు సీఎం అని చెప్పి కొన్నాళ్ళ పాటు ఒక నేతను ఆ పదవిలో కూర్చోబెట్టి సరైన సమయంలో బాబు కానీ చినబాబు కానీ సీఎం సీటులోకి వస్తారు అని కూడా ప్రచారం చేస్తున్నారు.
టీడీపీకి ఈ ఎన్నికలలో గెలుపు చాలా అవసరం. ఒక వైపు వైసీపీ మరో వైపు జనసేన ఉన్నాయి. ఈ రెండు పార్టీలను తట్టుకుని ముందుకు సాగాలీ అంటే బలమైన సామాజిక వర్గానికి కాపు కాయక తప్పదని కూడా మరో వాదన వినిపిస్తోంది. దీని వల్ల ఒక్క దెబ్బకు అటు జగన్ కే కాకుండా ఇటు పవన్ కి కూడా దెబ్బ తీయవచ్చు అన్న బహుముఖ వ్యూహాన్ని తెలుగుదేశం రచిస్తోంది అంటున్నారు. మరి ఇది ఎంతవరకూ నిజమో తెలియదు కానీ టీడీపీ కనుక ఇలా ఆలోచిస్తే వైసీపీ జనసేన దానికి ధీటైన వ్యూహాన్ని రూపొందించుకోవాల్సిందే అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.