Begin typing your search above and press return to search.
కాపునాడు పిలుపు..టీఆర్ ఎస్ కే మన ఓటు
By: Tupaki Desk | 6 Dec 2018 5:02 PM GMTతెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ తేదీ గడువు సమీపిస్తున్న కొద్ది రాజకీయం మరింత హీటెక్కుతోంది. పోలింగ్‌కు మరికొద్ది గంటలే సమయం ఉన్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర సమితికి కీలక వర్గం నుంచి మద్దతు తక్కింది. తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో కాపు ఓటర్లు టీఆర్ ఎస్ కే ఓటు వేయాలని కాపునాడు సంఘం గురువారం పిలుపునిచ్చింది. నెల క్రితమే దీన్ని తీర్మానించినట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. తమను బీసీలో చేరుస్తామని కాంగ్రెస్ - టీడీపీ పార్టీలు మోసం చేశాయని వెళ్లడించింది. మేనిఫెస్టో లో చెప్పిన వాగ్దానాలను అమలు చేయాలని కోరిన ఉద్యమకారుడి పై జరిగిన నిర్భందకాండను మరిచిపోవద్దని చెప్పింది. కాపునాడు టీడీపీకి మద్దతు ఇచ్చినట్లు వస్తున్న వార్తలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. టీఆర్ ఎస్ గెలుపు లో భాగం కావాలని వెళ్లడించింది.
2004 ఎన్నికల సమయంలో తమను బీసీల్లో చేర్చుతామని ప్రకటించి కాంగ్రెస్ మోసం చేసిందని - 2014 ఎన్నికల్లో టీడీపీ మోసం చేసిందని వెల్లడించింది. తమ హక్కుల కోసం పోరాటం చేసిన ముద్రగడ పద్మనాభంపై - కాపు కులానికి చెందిన మహిళలపై జరిగిన అవమానం మర్చిపోలేదని ఆ ప్రకటనలో పేర్కొంది. అందుకే కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలకు వ్యతిరేకంగా ఓటువేయాలని తీర్పు ఇచ్చింది. దీంతోపాటుగా ఇటీవలే మంత్రి కేటీఆర్ ను ఆహ్వానించి కాపుల మద్దతు గురించి ప్రకటించామని వెల్లడించింది. కాపునాడు పేరుతో తెలుగుదేశం పార్టీకి ఎవరో ఇస్తున్న మద్దతు అబద్దమని - టీఆర్ ఎస్ పార్టీకే కాపునాడు మద్దతని స్పష్టం చేసింది.