Begin typing your search above and press return to search.

పుల్వామా ఎఫెక్ట్: కరాచీ బేకరీల మటాష్

By:  Tupaki Desk   |   24 Feb 2019 9:48 AM GMT
పుల్వామా ఎఫెక్ట్: కరాచీ బేకరీల మటాష్
X
దేశంలో ‘కరాచీ బేకరీ’లకు మంచి ఆదరణ ఉండేది. ఇండియాలో ఎక్కువగా వ్యాపారం చేసే బేకరీల గ్రూపుగా ‘కరాచీ’కి పేరుంది. దేశవ్యాప్తంగా ఇదో బ్రాండ్ గా మారడంతో ప్రతి చిన్న పట్టణానికి కూడా కరాచీ బేకరీలు విస్తరించాయి. ఇప్పుడు దీనికో బ్రాండ్ ఏర్పడింది.

తాజాగా కరాచీ బేకరీలకు కష్టకాలం వచ్చింది. బెంగళూరులో కరాచీ బేకరీలపై దాడులకు స్థానికులు దిగుతున్నారు. బెంగళూరులోని ఇందిరానగర్ లో ఉన్న కరాచీ బేకరిపై స్థానిక ప్రజలు దాడికి తెగబడ్డారు. వెంటనే కరాచీ పేరును తొలగించాలని.. లేకపోతే బేకరీని ధ్వంసం చేస్తామని స్థానికులు హెచ్చరించారు. తాజాగా పుల్వామాలో భారత సైనికులను పాకిస్తాన్ ఉగ్రవాది హతమార్చిన నేపథ్యంలో పాకిస్తాన్ నగరమైన కరాచీ పేరు మీద ఉన్న ఈ బేకరీలను నడువనీయమని స్థానిక ప్రజలు ఆందోళనకు దిగారు.

దాదాపు 15మంది కరాజీ బేకరిలో చొరబడి రచ్చ చేశారు. వెంటనే కరాచీ పేరును తొలగించాలని సిబ్బందిని బెదిరించారు. పోలీసులకు దీనిపై నిర్వాహకులు ఫిర్యాదు చేయడంతో డీసీపీ రాహుల్ కుమార్ వచ్చి పరిస్థితిని చక్కదిద్దాడు. సీసీటీవీ ఆధారంగా దాడి చేసిన వారిని గుర్తిస్తామని తెలిపారు. పాకిస్తాన్ పేరుతో ఉన్న ఈ కరాచీ బేకరీ పేరును తొలగించాలని స్థానిక ప్రజలు షాపు ముందు నిలబడి ఆందోళనకు దిగారు.

అయితే అందరూ అనుకుంటున్న ‘కరాచీ బేకరీ’ సంస్థ సూత్రదారులు పాకిస్తానీలు కాదు.. దీని యజమాని పేరు శ్రీఖాన్ చంద్ రామ్ నాని జీ. ఈయన హిందువే.. పాకిస్తాన్ కు చెందిన వ్యక్తి కాదు.. భారతీయుడే.. 1947లో కరాచీలో రామ్ నాని కుటుంబం బేకరీలు పెట్టుకొని వ్యాపారం చేస్తుండేది. దేశ విభజన జరగడంతో ఈయన కుటుంబం కరాచీలో ఆస్తులు అమ్ముకొని హైదరాబాద్ వచ్చి స్థిరపడింది. అక్కడి సొంతూరు పేరు మీద ‘కరాచీ బేకరీల’ను స్థాపించాడు. అది ఇంతింతై విస్తరించి మహా వ్యాపారంగా మారింది. ఇలా భారతీయుడి బేకరీలకు పాకిస్తానీ పేరు ఉన్నందుకు జనాలు పెట్రేగిపోవడం చర్చనీయాంశంగా మారింది.