Begin typing your search above and press return to search.

వైసీపీ ఎంపీ పుట్టిన రోజు వేడుక‌ల్లో టీడీపీ ఎమ్మెల్యే!

By:  Tupaki Desk   |   15 Oct 2019 1:40 PM GMT
వైసీపీ ఎంపీ పుట్టిన రోజు వేడుక‌ల్లో టీడీపీ ఎమ్మెల్యే!
X
ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్రబాబు నాయుడుకు మ‌రోషాక్ త‌ప్ప‌దా..? త‌న పార్టీ ప్ర‌జాప్ర‌తినిధిగా, అనువ‌జ్ఞుడైన రాజ‌కీయ నేత‌గా పేరున్న ఓ ఎమ్మెల్యే వ్య‌వ‌హారం ఇప్పుడు రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అయింది. రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌ర‌న్న విష‌యం అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే వ్య‌వ‌హ‌రంతో చంద్ర‌బాబుకు చెమ‌ట‌లు ప‌డుతున్నాయి. ఇంత‌కు ఇంత సీనియ‌ర్ ఎమ్మెల్యే ఎలా మ‌రోపార్టీ ఎంపీ పుట్టిన రోజు వేడుక‌ల‌కు పోతార‌ని చంద్ర‌బాబు ఉడికిపోతున్నారు. ఇంత‌కు ఈ ఎమ్మెల్యే వ్య‌వ‌హ‌రంతో చంద్రబాబుకు చుక్క‌లు క‌నిపిస్తుండ‌గా - అస‌లు ఎందుకు ఈ ఎమ్మెల్యే ఆ ఎంపీ పుట్టిన రోజు వేడుక‌లు వెళ్ళిన‌ట్లు.. పార్టీ మారేందుకు ఏమైనా స‌న్న‌హాలు చేసుకుంటున్నారా అనే ప్ర‌శ్న‌లు పుడుతున్నాయి. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే వ్య‌వ‌హార‌శైలీపై ఏపీలో జోరుగా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాయి.

ప్ర‌కాశం జిల్లాకు చెందిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీ‌నివాసులు రెడ్డి ఈ రోజు పుట్టిన రోజు వేడుక‌లు జ‌రుపుకున్నారు. ఈ పుట్టిన రోజు వేడుక‌ల‌కు అదే జిల్లా చీరాల ఎమ్మెల్యే క‌రుణం బ‌ల‌రామ్ పాల్గొని అంద‌రికి షాక్ ఇచ్చారు. తాను ఒక్క‌టే కాదు.. త‌న‌తో పాటు త‌న కుమారుడు వెంక‌టేశ్‌ ను కూడా వెంట బెట్టుకుని ఈ వేడుక‌ల‌కు వెళ్ళారు. అంటే త‌న రాజ‌కీయ వార‌సుడిగా ఉన్న కొడుకును కూడా ఈ బ‌ర్త్‌డే పార్టీకి వెళ్ళ‌డంతో రాజకీయ వేడి రాజుకుంది. క‌ర‌ణం బ‌ల‌రామ్ త‌న కుమారుడిని వైసీపీలో చేర్చే ఆలోచ‌నలో ఉన్నార‌ని.... అందుకే వైసీపీ ఎంపీ పుట్టిన రోజు వేడుక‌లకు హాజ‌ర‌య్యార‌నే చ‌ర్చ జోరుగా జ‌రుగుతుంది.

ఈ పుట్టిన రోజు వేడుక‌ల్లో మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి కూడా పాల్గొన్నారు. అయితే ఈ వేడుక‌లో పాల్గొన్న ఎమ్మెల్యే క‌ర‌ణం .... శ్రీనివాసులు రెడ్డి పుట్టిన రోజు వేడుక‌ల్లో చివ‌రికంటా ఉన్నారు. ఎంపీని ఈ సంద‌ర్భంగా పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. ఎంపీకి శాలువా క‌ప్పి స‌న్మానించారు. అయితే ఎంపీ పుట్టిన రోజు వేడుక‌ల్లో టీడీపీ ఎమ్మెల్యే పాల్గొన‌డంలో ఎలాంటి రాజ‌కీయ మార్పు లేద‌ని, కేవ‌లం స‌న్నిహితుడు కావ‌డంతోనే పుట్టిన రోజు వేడుక‌ల‌కు వెళ్ళాడ‌ని టీడీపీ వాళ్లు చెపుతున్నారు. ఇక బ‌ల‌రాం, మాగుంట కాంగ్రెస్‌లో ఉన్న‌ప్ప‌టి నుంచి స్నేహితులే. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు కూడా వీరిద్ద‌రు టీడీపీలో ఎమ్మెల్సీలుగా ఉన్న సంగ‌తి తెలిసిందే.