Begin typing your search above and press return to search.
ఆమంచిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన కరణం బలరాం
By: Tupaki Desk | 2 Oct 2020 5:30 PM GMTవైసీపీలో మళ్లీ వర్గపోరు మొదలైంది. ప్రకాశం జిల్లా చీరాల వైసీపీలో మళ్లీ కీచులాట మొదలైంది. గతంలోనే టీడీపీలో ఉన్న ఎమ్మెల్యే కరణం బలరాం.. వైసీపీకి చెందిన ఆమంచి కృష్ణమోహన్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలున్నాయి.
తాజాగా కరణం బలరాం.. ఆమంచి కృష్ణ మోహన్ గురించి చేసిన పరోక్ష వ్యాఖ్యలు మళ్లీ వివాదానికి కారణమయ్యాయి. గత ఎన్నికల్లో సీఎం జగన్ గాలిలోనే చీరాల ప్రజలు టీడీపీ అభ్యర్థికి పట్టం కట్టారు అంటే వైసీపీ అభ్యర్థిపై ఉన్న వ్యతిరేకత అర్థం చేసుకోవాలని కరణం బలరాం.. తాజాగా ఆమంచిపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. చీరాల ప్రజలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ఎవరో వచ్చి ఇబ్బంది పెడుతుంటే చూస్తూ ఊరుకోం అని కరణం బలరాం హెచ్చరించారు. తనకు ఓటు వేయలేదన్న కారణంతో కొంతమందిని ఇబ్బంది పెడుతున్నారని విమర్శలు గుప్పించారు.
చీరాలలో ఒకే వైసీపీలో ఉన్న ఎమ్మెల్యే కరణం, ఆయన చేతిలో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే ఆమంచిల మధ్య ఆదిపత్య పోరు నడుస్తోంది. ఉప్పునిప్పుగా ఉండే వీరు ఇద్దరూ ఇప్పుడు కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్నా తాజాగా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం మళ్లీ ఆమంచిని ప్రయత్నం చేశారు.
ఆమంచిని ఉద్దేశించి పరోక్షంగా కొన్ని కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే కరణం బలరాం. జగన్ గాలిలోనే ప్రజలు చీరాలో టీడీపీ అభ్యర్థిని మెజారిటీతో గెలిపించారంటే అవతలి వ్యక్తిపై ఉన్న వ్యతిరేకతని అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు.
ప్రజాప్రతినిధులు పనుల కోసం వచ్చే వారితో మంచిగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలని కరణం అన్నారు.ఓట్లు వేయలేదని ఆమంచి కొంతమందిని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. లా అండ్ ఆర్డర్ విషయంలో చీరాల ప్రజలు భయపడాల్సిన పనిలేదని.. ెవరో వచ్చి ఇబ్బందులు పెడుతుంటే నేను చూస్తూ ఊరుకోనని కరణం తాజాగా హాట్ కామెంట్స్ చేశారు. అవిప్పుడు వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.