Begin typing your search above and press return to search.
ఓహో! ఎమ్మెల్యే టిక్కెట్ కావాలని ఇలా కూడా అడగొచ్చా?
By: Tupaki Desk | 22 Feb 2019 2:35 PM GMTరాజకీయాల్లో ముదుర్లంటే సీనియర్లే కానవసరం లేదు. రాజకీయాన్ని ఒంటబట్టించుకుని సీనియర్లను సైతం పక్కకు నెట్టేలా పథక రచనలు చేసేవారే ఈ రంగంలో ముదుర్లు అనిపించుకుంటారు. ఇదంతా పక్కన పెడితే ప్రకాశం టీడీపీలో టిక్కెట్ల కోసం జరుగుతున్న పోటీ భలే విచిత్రంగా ఉంది. ఎవరు ఎక్కడ టిక్కెట్ అడుగుతున్నారో.. ఎవరిని టిక్కెట్ అడుగుతున్నారో.. ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో తెలియక నాయకులే గందరగోళానికి గురవుతున్నారు.
ప్రకాశం టీడీపీలో సీనియర్ నేత ఎవరంటే టక్కున వినిపించే పేరు కరణం బలరాం. కానీ, ఆయనకు టిక్కెట్ దక్కడమనేది పెద్ద ప్రయాసగా మారింది. అద్దంకి టిక్కెట్ ఆయన ఆశిస్తున్నా గొట్టిపాటి రవికుమార్ కు ఇవ్వడానికి చంద్రబాబు రెడీ అయిపోవడంతో కరణం ఆశలొదులుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలోకి వెళ్లడంతో కరణం వెంటనే అక్కడ చేరి పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ, అక్కడా ఆయనకు పోటీ మొదలైంది.
అప్పటికే ఉన్న నేతలతో పాటు కొత్తకొత్త నేతలు కూడా చీరాల టిక్కెట్ కావాలంటున్నారట. ఓ నేత అయితే నేరుగా బలరాం వద్దకే వచ్చి మీకు కనుక టిక్కెట్ రాకపోతే నాకు ఇప్పించండి అని ప్రపోజ్ చేశారట.
చీరాల టీడీపీ టిక్కెట్ ఆశిస్తున్న ప్రస్తుత పొన్నూరు మునిసిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ సజ్జా హేమలత.. బలరాంనే కలిసి బయోడేటా ఇచ్చారు. తనకు టిక్కెట్ కావాలని కోరారు. అయితే, బలరాం కనుక చీరాల నుంచి పోటీ చేస్తే తాను పోటీలో ఉండనని చెప్పారట.
బలరాం కనుక బరిలో ఉంటే తాను పోటీ చేయబోనని హేమలత చెప్పినప్పటికీ బలరాం వర్గం మాత్రం ఆమెను నమ్మడం లేదని సమాచారం. ఆమె నేరుగా అధిష్ఠానం వద్దే టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. దీంతో చీరాల టిక్కెట్ కోసం కూడా పోరాడాలా అని బలరాం ఆవేదన చెందుతున్నారట.