Begin typing your search above and press return to search.
ట్రాఫిక్ సిగ్నల్‌గా కరీనా కపూర్.. వైరల్ అవుతున్న వీడియో!
By: Tupaki Desk | 18 July 2022 4:20 AM GMTమనదేశంలో జనాభా చాలా ఎక్కువ. దీనికి తగ్గట్టే రోడ్లు మీద విపరీతమైన ట్రాఫిక్. దీంతోపాటు ఉరుకుల పరుగుల జీవితంలో వేగంగా కార్యాలయాలకు, ఇళ్లకు చేరుకోవాలనుకునేవారు ఎక్కువే. అంతేకాకుండా మద్యం సేవించి వాహనాలు నడిపేవారి సంఖ్య అధికమే. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలు కూడా మనదేశంలో ఎక్కువే. ఒక నివేదిక ప్రకారం రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న దేశాల్లో.. రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నవారిలో భారత్ టాప్ లో ఉండటం గమనార్హం.
ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయినా రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట పడటం లేదు.
ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు సరికొత్తగా వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను పోస్టు చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. నెటిజన్లను ఈ వీడియో ఆకట్టుకుంటోంది.
అందులో రెడ్ లైట్ స్థానంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కనిపిస్తోంది.. రెడ్ సిగ్నల్ జంప్ చేయొద్దు. అటెన్షన్‌గా ఉండేవారినే 'పూ (కరీనా) ఇష్టపడుతుంది. అందుకే, ట్రాఫిక్ సిగ్నల్‌ని ఫాలో అవ్వండి' అనే క్యాప్షన్ తో ట్విట్టర్లో షేర్ చేశారు.
ఇందుకోసం ఢిల్లీ పోలీసులు కభీ ఖుషీ కభీ ఘమ్ సినిమా నుంచి ఒక సీక్వెన్స్‌ను తీసుకుని దాన్ని పునరావృతం చేశారు. ఈ సినిమాలోని కరీనా కపూర్ పాత్ర అయిన పూను తీసుకున్నారు. ఈ వీడియో క్లిప్‌లో.. వాహనం ఎరుపు ట్రాఫిక్ సిగ్నల్‌ను దాటి వేగంగా వెళుతుంది.
ఎరుపు లైట్‌పై తన ముఖాన్ని ఉంచిన పూ (కరీనా).. కారు ట్రాఫిక్ లైట్‌ను పట్టించుకోకుండా వెళ్తున్నప్పుడు ఆమె తన డైలాగ్.. యే కోన్ హై జిస్నే పూ కో దోబారా మడ్ కర్ నహీ దేఖా అని చెబుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అది చూసిన పలువురు పోలీసుల ప్రయత్నాన్ని ప్రశంసిస్తున్నారు.

Who's that traffic violator?
— Delhi Police (@DelhiPolice) July 16, 2022
Poo likes attention, so do the traffic lights !#RoadSafety#SaturdayVibes pic.twitter.com/ZeCJfJigcb