Begin typing your search above and press return to search.
బడ్జెట్ పై చర్చకు వెళుతున్న బాలీవుడ్ భామ
By: Tupaki Desk | 26 Feb 2016 4:02 PM GMTనాజూగ్గా.. ముట్టుకుంటే కందిపోయేలా ఉండే బాలీవుడ్ భామ కరీనాకపూర్ తాజాగా వార్తల్లోకి వచ్చారు. గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆమె.. ఇప్పుడు అందుకు భిన్నమైన రంగానికి సంబంధించి తన ప్రతిభను ప్రదర్శించనున్నారు. తల పండిన ఆర్థికవేత్తలు విశ్లేషించే సాధారణ వార్షిక బడ్జెట్ లైవ్ చర్చ కోసం ఆమె ఒక బిజినెస్ ఛానల్ కు వెళ్లనున్నారు.
ఫిబ్రవరి 29 (సోమవారం)న లోక్ సభలో ఆర్థికమంత్రి ప్రవేశ పెట్టే బడ్జెట్ మీద విశ్లేషణ చేసేందుకు ఆమె సిద్ధమైనట్లు కరీనా సన్నిహితులు చెబుతున్నారు. తాజాగా ఆమె నటించిన కీ అండ్ కా చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఆమె ఉద్యోగం చేస్తూ ఇంటిని నడిపే మోడ్రన్ భార్యగా.. ఆమె భర్త ఇంట్లో ఉండి పిల్లల బాధ్యతలు చూసే వ్యక్తిగా (అర్జున్ కపూర్) పాత్రలు ఉంటాయి. చిత్రానికి తగ్గట్లు ఆమె పోషించిన మోడ్రన్ విమెన్ కు తగ్గట్లు బడ్జెట్ సందర్భంగా సగటు వ్యక్తి స్పందన ఏమిటన్న కోణంలో ఆమె తన అభిప్రాయాలు వెల్లడిస్తారని తెలుస్తోంది.
బడ్జెట్ చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు కరీనా ఇప్పటికే కొంత కసరత్తు చేసినట్లు చెబుతున్నారు. గ్లామర్ తో బడ్జెట్ చర్చను నెట్టుకొస్తుందా? లేక.. నిజంగా తన లోపలి విషయాన్ని ప్రదర్శించి సత్తా చాటుతుందా? అన్నది తేలాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే.