Begin typing your search above and press return to search.

కరీంనగర్‌‌ పేరు మారుస్తాం... యోగి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

By:  Tupaki Desk   |   6 Dec 2018 7:27 AM GMT
కరీంనగర్‌‌ పేరు మారుస్తాం... యోగి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌
X
సంచ‌ల‌న ప‌రిణామాల‌తో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ త‌రచూ వార్త‌ల్లో నిలిచే సంగ‌తి తెలిసిందే. అలహాబాద్ పేరును ‘ప్రయాగ్ రాజ్‘గా మార్చే పనిని యోగీ సర్కార్ పూర్తి చేసింది. దీనికి తోడుగా, దేశంలోని అతి పురాతనమైన మొగల్‌సరారు జంక్షన్‌ను దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ జంక్షన్‌గా మార్చిన యోగి సర్కారు.. తాజా గా రాష్ట్రంలోని మూడు విమానాశ్రాయాల పేర్లను మార్చాలని నిర్ణయించింది. రారుబరేలి, కాన్పూర్‌, ఆగ్రాలో ఉన్న రక్షణ శాఖ విమానాశ్రాయాల పేర్లను మార్చనుంది. బరేలి విమానాశ్రాయాన్ని నాథ్‌నగరిగా (పౌరాణికాల్లో బరేలి పేరు), కాన్పూర్‌లోని చకేరి ఎయిర్‌పోర్ట్‌కు గణేష్‌ శంకర్‌ విద్యార్థి పేరు, ఆగ్రా విమానాశ్రాయాన్ని దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయగా మార్చాలని ప్రతిపాదించారు. దీని పై కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. ఇటీవ‌లే మూడు నెల‌ల పాటు పెళ్లిళ్లు రద్దు చేసుకోండి త‌మ ప్రభుత్వం త‌ర‌ఫున ఆయ‌న‌ ఆదేశం కూడా విడుద‌ల చేశారు. ఇలాంటి సంచ‌ల‌న‌కు మారు పేరు అయిన యోగీ ఆదిత్య‌నాథ్ తెలంగాణ‌లో కూడా ఈ పేర్ల మార్పును కొన‌సాగిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

ఎన్నికల ప్రచారంలో జిల్లాకు వచ్చిన యోగి ఆదిత్యనాథ్ కరీంనగర్‌ నియోజకవర్గ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ త‌ర‌ఫున ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ బండిసంజ‌య్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గెలిస్తే... కరీంనగర్ జిల్లా పేరును కరిపురంగా మారుస్తామని వెల్లడించారు. యోగి ఇలా ప్ర‌క‌టించ‌డం కలకలం రేపుతోంది. అసలు కరిపురం అంటే ఏమిటీ ? కరిపురంగా ఎందుకు మారుస్తారు ? అనే చర్చ జరుగుతోంది. యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత పలు నగరాల పేర్లను మార్చేశారు. దీనిని వ్యతిరేకించినా యోగి మాత్రం వెనక్కి తగ్గలేదు.

ఇదిలాఉండ‌గా, క‌రీంన‌ర్ పేరు మార్పు నేప‌థ్యంలో అస‌లు ఆ పేరు ఎలా వ‌చ్చింద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. కరీంనగర్ కు ఆ పేరు ఎలా వచ్చింది అంటె ?... సయ్యద్ కరీముద్దీన్ ఖిలాదారు పేరుమీదుగా నామకరణము చేయబడినది. పురాతన కాలము నుండి వేద అభ్యాసన కేంద్రముగా ప్రసిద్ధికెక్కినది. పూర్వము ఈ ప్రాంతమునకు 'సబ్బినాడు' అని పేరు. కరీంనగర్ మరియు శ్రీశైలములలో దొరికిన, కాకతీయ రాజులు రెండో ప్రోలరాజు మరియు ప్రతాపరుద్రుని శాసనాలు ఈ ప్రాంత ఘనమైన చరిత్రకు నిదర్శనాలు. కరినగరము కరి అనగా ఏనుగు, ఏనుగులు తిరిగే నగరము కావున ఈ నగరానికి కరినగరము అని పేరు వచ్చినది, కాలక్రమేనా కరీంనగర్ అని పిలువబడుతోంది. కాగా, యూపీ సీఎం ప్ర‌క‌ట‌న‌ నేప‌థ్యంలో మ‌రోమారు పేర్ల మార్పు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.