Begin typing your search above and press return to search.

కరీంనగర్ ఫేక్ ఎఫ్ఐఆర్ కేసు కీలక మలుపుకు ..

By:  Tupaki Desk   |   30 Dec 2021 9:30 AM GMT
కరీంనగర్ ఫేక్ ఎఫ్ఐఆర్ కేసు కీలక మలుపుకు ..
X
ఒక పేపర్ కు సంబంధించి నకలు కావాలంటే జిరాక్స్ తీసుకుంటారు. కానీ ఆ పేపర్లు జిరాక్స్ తీస్తే పెద్ద ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. అయినా పెద్ద ప్రమాదమే జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఓ వ్యక్తిపై ఫేక్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. అదే నెంబర్ పై మరో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన పోలీసులు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారా..? అనే అనుమానం కలుగుతోంది. అయితే బాధితుడు ఓ లాయర్ ను సంప్రదించడంతో ఆ గుట్టు రట్టయినట్లు సమాచారం.

కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 255/2020 అనే నంబర్ నకిలీ ఎఫ్ఐఆర్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ నెంబర్ పై రెండు ఎఫ్ ఐఆర్లు నమోదు కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

అయితే స్టేషన్లో జరిగిన మరో పరిమాణం పలు అనుమానాలకు దారి తీస్తోంది. 2020 సెప్టెంబర్ 9న నల్లగొపు శ్రీనివాస్ పై ఐసీసీ 341, 323, 506 సెక్షన్ల కింద 255/2020 నెంబర్ తో ఎఫ్ఐఆర్ నమోదైంది. అంతేకాకుండా అతడిని అరెస్టు చేస్తున్నామని, వైద్య పరీక్షలు సిద్ధంగా ఉండాలని పోలీసులు తెలిపినట్లు బాధితుడు పేర్కొన్నాడు.

అయితే బాధితుడు బెదిరిపోయి తన ఇల్లు విక్రయించేందుకు అంగీకరించాడు. దీంతో అతడిని అరెస్టు చేయలేదు. పైగా పిలిచినప్పుడు కోర్టుకు రావాలని సీఐ, ఎస్ఐ తెలపడంతో ఎఫ్ఐఆర్ కాపీతో బాధితుడు ఇంటికి వెళ్లాడు. అయితే వెంటనే అతడిని స్టేషన్ కు పిలిపించారు. హడావుడిగా బాధితుడి నుంచి ఎఫ్ఐఆర్ కాపీని తీసుకొని వాసన చూశారు. అయితే ఈ సమయంలో శ్రీనివాస్ అయోమయానికి గురయ్యాడు.

వెంటనే దీనిని జీరాక్స్ కానీ తీశావా..? అని సదరు ఎస్ ఐ శ్రీనివాస్ ను కోపంతో అడిగారు. దీంతో తనకేమీ తెలియదని చెప్పాడు. ఒకవేళ జిరాక్స్ తీస్తే పెద్ద సమస్యే ఎదురయ్యేది అని ఎస్ ఐ అన్నాడు.

దీంతో శ్రీనివాస్ కు అనుమానం వచ్చింది. వాస్తవానికి శ్రీనివాస్ ఆ ఎఫ్ఐఆర్ కాపీని జిరాక్స్ తీసుకున్నాడు. కానీ ఎస్ ఐ కోపం చూసి ఆ విషయం చెప్పలేదు.ఎఫ్ఐఆర్ కాపీ ఎస్ ఐ వాసన చూసి జిరాక్స్ తీస్తే కార్బన్ స్మెల్ వస్తుందని అలా చేశాడు. కానీ శ్రీనివాస్ జిరాక్స్ తీసి చాలా సేపయింది. దీంతో ఎస్ఐకి కార్బన్ స్మెల్ రాలేదు.

ఇదిలా ఉండగా ఏడాది దాటుతున్నా తనను కోర్టుకు పిలవకపోవడంతో శ్రీనివాస్ ఓ లాయర్ ను సంప్రదించాడు. దీంతో అసలు విషయం బయటపడింది. అయితే ప్రస్తుతం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ రెండు ఎఫ్ఐఆర్లు ఒకే నంబర్ పై ఉండవు. అయితే ఈ ఘటనపై విచారణ జరుపుతున్నాం. ఫిర్యాదుదారులతో పాటు నిందితులు, సిబ్బందిని విచారిస్తున్నామని కమిషనర్ తెలిపారు.