Begin typing your search above and press return to search.
కేసీఆర్ మాటకు ఓకే అన్న మోడీ సర్కారు
By: Tupaki Desk | 16 Jun 2016 9:46 AM GMTతెలంగాణ ప్రభుత్వానికి.. బీజేపీకి మధ్య మాటల యుద్ధం సంగతి ఎలా ఉన్నా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాటకు కేంద్రంలో మాత్రం మంచి పలుకుబడి ఉన్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఏదైనా కోరితే ఆ అంశంపై కేంద్రం సానుకూలంగా స్పందించటం ఈ మధ్యన కనిపిస్తోంది. ఇందుకు తాజాగా పరిణామమే నిదర్శనంగా చెప్పాలి.
స్మార్ట్ సిటీ జాబితాలో హైదరాబాద్ స్థానే కరీంనగర్ ను చేర్చాలంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన సూచనకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. ముందుగా ప్రకటించిన విధంగా హైదరాబాద్ ను జాబితాలో నుంచి తొలగించి కరీంనగర్ ను చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆశించినంత డెవలప్ మెంట్ హైదరాబాద్ లో ఉన్న నేపథ్యంలో.. ఆ నగరానికి బదులుగా స్మార్ట్ సిటీస్ జాబితాలో కరీంనగర్ ను చేర్చాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఒక లేఖ కేంద్రానికి రాశారు. దీనికి సానుకూలంగా స్పందించిన మోడీ సర్కార్ కరీంనగర్ ను స్మార్ట్ సిటీల జాబితాలో చేరుస్తూ నిర్ణయం తీసుకుంది.
తాజాగా కేంద్రం తీసుకున్న మార్పును టీఆర్ ఎస్ ఎంపీ వినోద్ వెల్లడించారు. చూస్తుంటే.. కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పలుకుబడి పెరుగుతున్నట్లుగా కనిపిస్తుందని చెప్పాలి. స్మార్ట్ సిటీల ఎంపికలో చాలానే కసరత్తు ఉందంటూ చెప్పే మాటలకు భిన్నంగా కేసీఆర్ లేఖ రాయగానే.. మొత్తం మారిపోవటం విశేషమని చెబుతున్నారు.