Begin typing your search above and press return to search.
కిరాక్ పుట్టిస్తున్న రూ.13 కోట్ల కారు
By: Tupaki Desk | 26 March 2018 10:01 AM GMTఈ కారు గురించి విన్నంతనే అపర కుబేరులు సైతం తాము వాడుతున్న కారును వదిలేసి.. దీని కోసం మోజు పడటం ఖాయం. వాహన రంగంలో సంచలనంగా మారిన అతి ఖరీదైన కారు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సంపన్నులు వాడే కార్లతో పోల్చినప్పుడు ఈ కారు ధర ఎక్కువగా ఉండటమే కాదు.. తాము వాడే కార్లు మరీ చౌకగా అనిపించటం ఖాయం.
ఒక కారు ధర రూ.13 కోట్లా? అందులో ఏం ఉంటుంది? అన్న ప్రశ్న రాక మానదు. ఇంతకీ ఇంత ఖరీదైన కారును ఎవరు తయారు చేశారు? ఎక్కడ తయారు చేశారు? ఇందులో ఉన్న ప్రత్యేకత ఏమిటి? అన్న క్వశ్చన్లకు సమాధానాలు వెతికితే.. చైనాకు చెందిన ఐఏటీ కంపెనీ దీన్ని తయారు చేసింది. ఈ ఖరీదైన కారును కేవలం తొమ్మిదంటే తొమ్మిది మాత్రమే తయారు చేయనున్నారు.
ఈ కారుకు బుల్లెట్ ఫ్రూప్ గా మారిస్తే మరింత ఖరీదెక్కుతుందని చెబుతున్నారు. ప్రత్యేక ఎడిషన్ గా తయారు చేసిన ఈ కారు ప్రత్యేకత ఏమిటంటే.. కారు బాడీలో కర్వ్ లు అన్నవి ఉండవట. తిన్నగా.. కోణీయ ఆకృతిలో కారును డిజైన్ చేశారు. చివరకు కారు బల్బ్‌లు కూడా కోణీయ షేప్ లోనే తీర్చిదిద్దటం గమనార్హం. హెడ్ ల్యాంప్.. ఫాగ్ ల్యాంప్ లు కూడా త్రికోణాకృతిలో ఉండటం గమనార్హం.
సంపన్నులు సైతం ఈ కారును చూసి ఫిదా కావాల్సిందే. ఎందుకంటే.. ఈ కారులోపలి ఇంటీరియర్ చూసినంతనే మనసును ఆకట్టుకునేలా ఉంటుంది. టీవీ.. ఫ్రిజ్.. ఎస్ రెసో మెషిన్లు లాంటి వసతులకు కొదవ ఉండదు. హోటల్ లాంజ్ ను తలపించేలా ఉండే ఈ కారు స్పెషాలిటీ ఏమిటంటే.. మైనస్ 40 డిగ్రీల నుమచి 200 డిగ్రీల టెంపరేచర్ వరకూ ఈ కారును జోరుగా నడిపించేయొచ్చు.
మరింత ఖరీదైన కారుకు ఏదైనా పరిమితులు ఉన్నాయా? అంటే ఉన్నాయి మరీ. ఈ కారు వెడల్పు 8.2 అడుగులు ఉంటుంది. నలుగురుకూర్చునేలా డిజైన్ చేసిన ఈ కారును మామూలు రోడ్ల మీద నడపటం కష్టం. అంతేకాదు..ఈ కారు బరువు 6వేల కేజీలు. ఇంత భారీ బరువుతో ఉండటంతో దీన్ని గంటకు 140 కిలోమీటర్ల కంటే వేగంగా నడపలేని పరిస్థితి. వేగంలో మిగిలిన కార్లతో పోలీ పడనప్పటికీ.. సెక్యురిటీ.. స్టైల్.. స్పెషాలిటీలలో మాత్రం దీన్ని కొట్టే కారు ఇప్పటికైతే లేదని చెబుతున్నారు.