Begin typing your search above and press return to search.

వైరల్: దుర్గాదేవికి మంత్రి లేఖ.. దేనికోసమంటే?

By:  Tupaki Desk   |   18 Sep 2020 5:30 PM GMT
వైరల్: దుర్గాదేవికి మంత్రి లేఖ.. దేనికోసమంటే?
X
ఎంత ఎత్తుకు ఎదిగినా ఎవరి నమ్మకాలు వారివి. ఇప్పటికీ సమాజంలోని మెజార్టీ వర్గాల్లో దేవుడన్నా, భక్తి అన్న చాలా ఎక్కువ. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఈ నమ్మకాలు ఇంకా ఎక్కువ. సీఎం కేసీఆర్ అయితే హోమాలు, యజ్ఞాలు చేస్తుంటారు. ఈ మధ్య పవన్ సైతం దీక్షలు చేస్తున్నాడు.

రాజకీయంగా ఎదగాలనుకునే వారు ముఖ్యంగా దైవభక్తిలో మునిగిపోతారు. మంత్రి పదవులు కావాలని.. సీఎం అవ్వాలని దేవుడిని కోరుకుంటారు. ఓ మంత్రికి డిప్యూటీ సీఎం కావాలనే కోరిక బలంగా ఉన్నది ఆ విషయాన్ని అధిష్టానం ముందుకు తీసుకెళ్లకుండా ఆ దేవుడికే లెటర్ రాశాడు.. అది కాస్తా వైరల్ గా మారింది.

కర్ణాటక మంత్రి బి. శ్రీరాములు నిన్న కలబుర్గిలోని దేవాలయాన్ని సందర్శించారు. తన మనసులోని కోరికను కాగితంపై రాసి అమ్మవారి పాదాల చెంత ఉంచాడు. ఆ మంత్రి మనసులో ఏముందో బహిర్గతమైంది. అమ్మవారి కోరికను అధిష్టానం నెరవేరుస్తుందా? లేదా అన్నది చూడాలి.

స్వాతంత్య్రానికి పూర్వం హైదరాబాద్ సంస్థానంలోనే బళ్లారి, కలబుర్గి ప్రాంతాలుండేవి. తెలంగాణ విమోచనం తరువాత కలబుర్గి ప్రాంతం కర్ణాటకలో విలీనం అయ్యింది. దీంతో ప్రతీ ఏడాది సెప్టెంబర్ 17న ఇక్కడ విమోచన దినాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో మంత్రి శ్రీరాములు పాల్గొనడం విశేషం. తెలంగాణలో మాత్రం అలాంటి వేడుకలేవీ జరపడం లేదు.