Begin typing your search above and press return to search.

రిలీఫ్‌: టీ మంత్రి.. ఎంపీకి ఓకే చెప్పిన క‌ర్ణాట‌క‌

By:  Tupaki Desk   |   18 Aug 2015 12:17 PM GMT
రిలీఫ్‌: టీ మంత్రి.. ఎంపీకి ఓకే చెప్పిన క‌ర్ణాట‌క‌
X
క‌ర్ణాట‌క స‌ర్కారు నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టుల‌ను ప‌రిశీలించేందుకు బ‌య‌లుదేరిన తెలంగాణ రాష్ట్ర మంత్రి జూప‌ల్లి కృష్ణారావు.. ఎంపీ జితేంద‌ర్ రెడ్డిల‌కు ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదురైంది. క‌ర్ణాట‌క రాష్ట్రం నిర్మిస్తున్న ప్రాజెక్టుల కార‌ణంగా తెలంగాణ ప్ర‌యోజ‌నాలు భారీగా దెబ్బ తింటాయ‌న్న వాద‌న నేప‌థ్యంలో.. ఆ ప్రాజెక్టుల‌ను స్వ‌యంగా ప‌రిశీలించేందుకు వారు బ‌య‌లుదేరి వెళ్లారు.

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుంచి క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దుల్లోకి వెళ్లిన వారిని.. క‌ర్ణాట‌క రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. ప్రాజెక్టులు చూసేందుకు అనుమ‌తించ‌మ‌ని చెప్పారు. దీంతో.. టీ మంత్రి.. ఎంపీల వెంట ఉన్న నేత‌లు.. టీఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున నినాదాలు చేసి.. ఆందోళ‌న‌కు దిగ‌టంతో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఈ స‌మ‌యంలో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు.. క‌ర్ణాట‌క నేత‌ల‌తో ఫోన్ లో మంత‌నాలు సాగించారు. మ‌రోవైపు.. త‌మ‌ను ప్రాజెక్టులు చూసేందుకు అనుమ‌తించాలంటూ మంత్రి వెంట ఉన్న వారు ఆందోళ‌న‌కు దిగారు. తెలంగాణ‌రాష్ట్ర మంత్రి జూప‌ల్లి కృష్ణారావు కోరిన ప్ర‌కారం.. త‌మ ప్రాజెక్టులు చూసేందుకు అనుమ‌తిస్తామ‌ని.. కాకుండా.. మంత్రి.. ఎంపీ వాహ‌నాలు రెండూ వెళ్లొచ్చ‌ని పేర్కొన్నారు. దీంతో.. ఇబ్బందిక‌ర వాతావ‌ర‌ణం నుంచి.. క‌ర్ణాట‌క చేప‌ట్టిన ప్రాజెక్టుల‌ను చూడాల‌న్న తెలంగాణ రాష్ట్ర మంత్రి.. ఎంపీల డిమాండ్ తీరిన‌ట్లు అయ్యింది.