Begin typing your search above and press return to search.
కేసీఆర్ కు షాకిచ్చిన రుత్వికులు
By: Tupaki Desk | 27 Dec 2015 8:53 AM GMTగడిచిన నాలుగు రోజులుగా సాగుతున్న అయుత చండీయాగానికి సంబంధించి వంక పెట్టటానికి వీల్లేకుండా కార్యక్రమాలు ఒకటి తర్వాత ఒకటిగా జరిగిపోతున్న సంగతి తెలిసిందే. చండీయాగాన్ని చూసేందుకు భారీగా తరలివచ్చిన భక్తజనంతో ఇబ్బందులు ఎదురయ్యాయే తప్పించి.. మిగిలిన కార్యక్రమం అంతా దాదాపుగా ఎలాంటి లోపం లేకుండానే సాగిపోయింది. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు యాగస్థలికి వచ్చిన సందర్భంగా హోమగుండంలో హోమద్రవ్యాలు వేసే సమయంలో మంట ఎక్కసారి ఎగిసిపడటం మినహా ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు.
అంతా బాగా జరిగిపోతుందనుకుంటున్న సమయంలో.. ఆదివారం ఉదయం.. భారీగా హోమగుండాల కారణంగా పెద్ద ఎత్తున పొగ కమ్ముకోవటం.. ఊపిరి ఆడని పరిస్థితుల్లో రుత్వికులు బయటకు పరుగులు తీయటం.. ఆ తర్వాత ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఏర్పాటు చేయటం తెలిసిందే. ఈ సందర్భంగా కాసేపు ఆటంకం కలగటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు ఫ్యాన్లను ఏర్పాటు చేసి.. బ్రాహ్మణుల్ని లోపలకు రావాలంటూ నిర్వాహకులు కోరుకోవటం జరిగింది.
మిగిలిన వారు యథావిధిగా తమ తమ స్థానాలకు వెళ్లిపోతే.. మహారాష్ట్ర.. కర్ణాటక రాష్ట్రాలకు చెందిన రుత్వికులు తమకు ఇవ్వాల్సిన డబ్బు కోసం పట్టుబట్టటం.. ఆ సంగతేదో తేల్చాలని చెప్పటం కొద్దిపాటి గందరగోళానికి కారణమైంది. అందరు బ్రాహ్మణులు వచ్చినా.. కొందరు మాత్రం రాకపోవటాన్ని గుర్తించిన నిర్వాహకులు.. వారికి అందాల్సిన దక్షిణ అందుతుందని.. యాగాన్ని ఆటంకపర్చొద్దంటూ వ్యాఖ్యలు వినిపించాయి. నిజానికిఇంత పెద్ద కార్యక్రమంలో.. రుత్వికులకు చెల్లించే మొత్తం పెద్ద విషయమే కాదు.
కానీ.. దీనికి సంబంధించిన నిరసన వ్యక్తం కావటం విస్మయానికి కారణమైంది. విశ్వసనీయ వర్గాల ప్రకారం.. కేసీఆర్ తరఫున మాట్లాడిన వారంతా డబ్బు విషయంలో చక్కగానే ఉన్నప్పటికీ.. రుత్వికుల్ని తెచ్చిన వారి కక్కుర్తి మూలంగా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందన్న మాట వినిపిస్తోంది. అయినా.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యక్తిగత హోదాలో ఇంత భారీగా కార్యక్రమం నిర్వహిస్తుంటే.. యాగంలో కీలకమైన రుత్వికులకు ఇవ్వాల్సిన దక్షిణ మొత్తాన్ని ఇవ్వకుండా ఉండరు. అయితే.. తమను తీసుకొచ్చిన వారి వ్యవహారం నచ్చకనే కర్ణాటక.. మహారాష్ట్ర రుత్వికులు ఇలా వ్యవహరించి ఉంటారన్న మాట వినిపిస్తోంది. ఈ విషయంలో నిర్వాహకుల లోపం ఏమీ లేకున్నా.. రుత్వికుల మధ్య నెలకొన్ని ఆర్థిక పరమైన విభేదాల వల్లే ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి నెలకొందన్న మాట వినిపిస్తోంది.