Begin typing your search above and press return to search.

ప‌క్కా హంగ్‌: పోటాపోటీగా ఫ‌లితాలు

By:  Tupaki Desk   |   15 May 2018 2:35 AM GMT
ప‌క్కా హంగ్‌:  పోటాపోటీగా ఫ‌లితాలు
X
అనుకున్న‌దే అయ్యింది. అంచ‌నాలే నిజ‌మ‌య్యాయి. క‌ర్ణాట‌క‌లో హంగ్ త‌ప్ప‌దంటూ దాదాపు 17 మీడియా సంస్థ‌లు ఎగ్జిట్ పోల్స్ కు త‌గ్గ‌ట్లే తాజా ట్రెండ్ స్ప‌ష్టం చేస్తోంది. ఈ ఉద‌యం ఓట్ల లెక్కింపు మొద‌లైన అర‌గంట‌లోనే ఫలితం ఎలా ఉండ‌నుంద‌న్న అంశంపై ఒక క్లారిటీ వ‌చ్చేస్తోంది.

గ‌తంలో ఎప్పుడూ లేనంత తీవ్రంగా పోటీ నెల‌కొన్న క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌.. బీజేపీలు రెండూ పోటాపోటీగా ఉన్నాయి. రెండు పార్టీల మ‌ధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ తో పోలిస్తే.. కాంగ్రెస్ విజ‌యం సాధించే సీట్ల విష‌యంలో కాస్త వెనుక‌బాటు క‌నిపిస్తోంది. అదే స‌మ‌యంలో.. బీజేపీకి వ‌స్తాయ‌నుకున్న సీట్ల కంటే ఎక్కువ సీట్లు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి.

ఇప్ప‌టివ‌ర‌కూ వ‌చ్చిన ట్రెండ్స్ ను చూస్తే.. కాంగ్రెస్‌.. బీజేపీల మ‌ధ్య కేవ‌లం ఒక‌ట్రెండు సీట్ల వ్య‌త్యాసం మాత్ర‌మే ఉంది. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే.. ప్ర‌భుత్వాన్ని ఎవ‌రు ఏర్పాటు చేస్తార‌న్న‌ది మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారుతోంది. మొద‌ట్నించి చెబుతున్న‌ట్లే.. క‌ర్ణాట‌క‌లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌టంలో కీ రోల్ ప్లే చేసే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్న జేడీఎస్ ఈసారి కింగ్ మేక‌ర్ పాత్ర పోషించ‌టం ఖాయం.

ఇప్ప‌టివ‌ర‌కూ వెలువ‌డిన ఫ‌లితాల ట్రెండ్‌ను చూస్తే.. క‌ర్ణాట‌క‌లో హంగ్ ఖాయ‌మైన‌ట్లే. తొలిద‌శ‌లో వెలువ‌డిన ఫ‌లితాల‌కు భిన్నంగా తాజా ట్రెండ్ న‌డుస్తోంది. కాంగ్రెస్‌.. బీజేపీల మ‌ధ్య సీట్ల తేడా కేవ‌లం ఒక‌ట్రెండు మాత్ర‌మే ఉంది. ఉద‌యం ఎన్నిమిదిన్న‌ర ప్రాంతంలో బీజేపీకి 44 స్థానాల్లో అధిక్య‌త‌తో ఉంటే కాంగ్రెస్ 46 స్థానాల్లో అధిక్య‌త‌లో ఉంది. ఇక‌.. జేడీఎస్ 20 స్థానాల్లో ఇత‌రులు ఒక్క స్థానంలో అధిక్య‌త‌లో ఉన్నారు. ఈ లెక్క‌న చూస్తే.. జేడీఎస్ సైతం త‌న బ‌లాన్ని మ‌రింత పెంచుకుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రి.. రానున్న గంట‌న్న‌ర‌లో వెలువ‌డే ట్రెండ్ తుది ఫ‌లితం ఎలా ఉంటుంద‌న్న‌ది డిసైడ్ చేసే అవ‌కాశం ఉంది.