Begin typing your search above and press return to search.
ఓలా క్యాబ్ లపై ఆరు నెలల నిషేధం
By: Tupaki Desk | 23 March 2019 8:56 AM GMTప్రయాణికులకు ఎంతో సౌలభ్యంగా ఉండే ఓలా క్యాబ్ లపై నిషేధం పడింది. క్యాబ్ ల నిర్వహణలో నిబంధనలు అతిక్రమించినందుకు ఓలా లైసెన్స్ ను కర్ణాటక ప్రభుత్వం రద్దు చేసింది. ఆరు నెలల పాటు ఓలా క్యాబ్ సర్వీసులపై నిషేధం విధిస్తూ రాష్ట్ర రవాణాశాఖ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
ఇటీవలే ఓలా బైక్ లపైనా సర్వీసులు ప్రారంభించింది. అయితే కార్లకు అనుమతి తీసుకున్న ఓలా సంస్థ బైక్ లు నడిపేందుకు అనుమతి తీసుకోలేదు. దీనిపై సమాచారం అందడంతో కర్ణాటక రవాణా శాఖ ప్రాథమిక దర్యాప్తు నిర్వహించింది. నిజమని తేలడంతో వివరణ ఇవ్వాలని ఓలా లిమిటెడ్ కు నోటీసులు జారీ చేసింది.
కాగా ఓలా ఇచ్చిన రాతపూర్వక వివరణతో సంతృప్తి చెందని కర్ణాటక అధికారులు లైసెన్స్ లను రద్దు చేశారు. లైసెన్స్ ధ్రువీకరణ పత్రాలను 3 రోజుల్లోగా రవాణా శాఖ కార్యాలయంలో అందజేయాలని ఆదేశించారు.
ఓలా సేవలు దేశంలో 2010లో ముంబైలో ప్రారంభమయ్యాయి. తర్వాత ఇతర దేశంలోని ప్రధాన నగరాలకు విస్తరించాయి. తర్వాత కాలంలో బెంగళూరుకు ఓలా ప్రధాన కార్యాలయాన్ని తరలించారు. ఓలా కర్ణాటక మొత్తంలో బెంగళూరు, హుబ్లీ, మంగళూరు, మైసూరుల్లో సర్వీసులు నడుపుతోంది.