Begin typing your search above and press return to search.
సెగలు పుట్టిస్తున్న ఈశ్వరప్ప రేప్ మాటలు
By: Tupaki Desk | 18 Oct 2015 5:34 AM GMTనోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న నేతల బాధ్యతారాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు కర్ణాటక బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప. నోటికి వచ్చినట్లుగా మాట్లాడేసి వివాదాల్లోకి కూరుకుపోవటం ఆయనకేం కొత్త కాదు. కానీ.. ఈసారి ఆయన నోటి వెంట వచ్చిన మాటలు సెగలు పుట్టిస్తున్నాయి. నోరు జారిన విషయాన్ని తెలుసుకొని చెంపలేసుకునే పనిలో ఎంత బిజీగా ఉన్నా ఆయనపై మాత్రం విమర్శలు తగ్గని పరిస్థితి.
కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలపై విపక్ష పార్టీల పాత్ర గురించి ప్రశ్నించిన ఒక మహిళా జర్నలిస్టును ఉద్దేశించి ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావటమే కాదు.. తీవ్ర విమర్శలకు గురైంది.
కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలకు ప్రతిపక్ష పార్టీగా మీ పాత్ర ఏమిటన్న దానికి బదులిచ్చిన ఈశ్వరప్ప.. ‘‘మీరు మహిళ. ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. ఎవరో మిమ్మల్ని లాక్కెళ్లి అత్యాచారం చేస్తే ఏం చేయగలం? ప్రతిపక్షాలుగా మేం ఎక్కడో ఉంటాం. అప్పుడు మేమేం చేయగలమో మీరే చెప్పాలి’’ అంటూ ఎదురు ప్రశ్నించారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై అధికారపక్షంతోపాటు.. మిగిలిన విపక్ష పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు.
తానుచేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్న విషయాన్ని గుర్తించిన ఈశ్వరప్ప..విమర్శల తీవ్రత తగ్గించే ప్రయత్నం షురూ చేశారు. కర్ణాటకలోని మహిళలంతా తన అక్కచెల్లెళ్లుగా పేర్కొన్నారు. నిజంగా అయ్యగారికి అంత సీన్ ఉంటే.. తన అక్క.. చెల్లెలపై ఎవరైనా అఘాత్యం చేస్తున్నా.. ఎక్కడో ఉండే తాను ఏం చేయగలనన్న బుద్ధిలేని మాట నోటి వెంట వచ్చి ఉండేదా..?