Begin typing your search above and press return to search.

నిలవాలంటే గెలవాల్సిందే .. మూడు ముక్కలాట ?

By:  Tupaki Desk   |   4 Dec 2019 9:45 AM GMT
నిలవాలంటే  గెలవాల్సిందే .. మూడు ముక్కలాట ?
X
రాజకీయం లో ఏదైనా సాధ్యమే. అప్పటివరకు బద్ద శత్రువులు గా ఉన్నవారు కూడా పార్టీ హై కమాండ్ ఆదేశిస్తే ..ఇద్దరు కలిసి పార్టీ కోసం పనిచేయాల్సిందే. అవసరానికి పార్టీ లే కలిసిపోతుంటే .. ఇక రాజకీయ నేతలెంత. ఈ మద్యే మహారాష్ట్ర లో జరిగిన సంఘటనే దీనికి ఉదాహరణ. పొత్తులతో బరిలోకి దిగిన బీజేపీ , శివసేన ఎన్నికల తరువాత బద్ద శత్రువులుగా మారి ..ఇతర పార్టీ నేతలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు వెళ్ళింది. అందుకే అంటారు రాజకీయం లో ఏదైనా సాధ్యమే.

ఇకపోతే ప్రస్తుతం దేశం మొత్తం కర్ణాటక వైపే చూస్తుంది. ప్రస్తుతం కర్ణాటక లో ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అలాగే కర్ణాటక లో జరిగిన రాజకీయం కూడా అందరికి తెలిసే ఉంటుంది. దీనితో ఈ ఎన్నికలలో ఎవరు ఎక్కువగా ప్రజలని ప్రభావితం చేయగలిగే వారికే అధికారం రావచ్చు. దీనితో మూడు పార్టీలు కూడా ఈ ఎన్నికలలో సర్వశక్తులు ఒడ్డుతుంది. ఈ 15 స్థనాలని తిరిగి పొందటం ద్వారా తమ సత్తా ఏంటో బీజేపీ కి తెలియజెప్పాలని కాంగ్రెస్ , జేడీఎస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ప్రచార సమయం మంగళవారం సాయంత్రానికి ముగిసిపోయింది. ఈ ప్రచారంలో పోటాపోటీగా కీలక నేతలు తమ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు.

గెలుపు పై ఎవరి అంచనాలు వారికున్నా ఇంత వరకు రాష్ట్ర రాజకీయాల్లో ఫిరాయింపు దారులు గట్టెక్కిన ఉదంతాలు కేవలం 10శాతం మాత్రమే ఉండడంతో ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చివరి రెండు మూడు రోజుల్లో కులంకార్డును బీజేపీ జోరుగా ప్రయోగించింది. దీనిపై కాంగ్రెస్‌ పెద్ద పెట్టున అభ్యంతరాలు లేవనెత్తింది. ఓటమి భయంతోనే బీజేపీ నేతలు కులం కార్డును తెరపైకి తెచ్చారని కాంగ్రెస్ , జేడీఎస్ ఆరోపణలు గుప్పించింది.

ఈ నెల 5న జరుగునున్న ఉప ఎన్నికల్లో ఆయా పార్టీల అభ్యర్థులను గెలిపించుకునేందుకు పార్టీల నాయకులు, విసృతంగా ప్రచారం చేశారు. రాష్ట్ర రాజకీయాలకే కేంద్ర బిందువుగా మారిన విజయనగర(హొసపెటె) ఉప ఎన్నికలో నాలుగు పార్టీల అభ్యర్థులతో పాటు ప్రధానం గా బీజేపీ రెబల్‌ అభ్యర్థి కూడా పోటీలో ఉండడం ఆసక్తి కరంగా మారింది. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ నియోజకవర్గం లో అన్ని పార్టీల కీలక నేతలు ప్రచారం చేయడం తో ఈ హొసపెటె ఎన్నికల ఫలితాల పై అమితమైన ఆసక్తి నెలకొని ఉంది. ఇకపోతే ఈ ఎన్నికలలో మెజారిటీ స్థానాలలో అధికార పార్టీ అయిన బీజేపీ విజయం సాధించకపొతే మళ్లీ ప్రతిపక్షానికే పరిమితం క్వావల్సిందే. అలాగే ఈ ఎన్నికలలో పట్టు నిలుపుకొని మరోసారి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి జేడీఎస్ , కాంగ్రెస్ అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు సమాచారం.