Begin typing your search above and press return to search.
ఆశావహులపై నీళ్లు చల్లిన యడియూరప్ప!
By: Tupaki Desk | 5 Feb 2020 2:30 PM GMTకర్ణాటక లో కేబినెట్ పునర్వ్యస్థీకరణ చేసే ఉద్దేశం లేదని ప్రకటించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప. రేపోమాపో తను చేయబోది కేవలం కేబినెట్ విస్తరణ మాత్రమే అని ఆయన ప్రకటించారు. పునర్వ్యస్థీకరణ చేయబోవడం లేదని ఆయన తెలిపారు. కేబినెట్ పునర్వ్యస్థీకరణ జరుగుతుందని కర్ణాటక బీజేపీ నేతలు గట్టిగా ఆశలు పెట్టుకున్నారు. ప్రత్యేకించి పార్టీ పాత కాపుల్లో ఆ ఆశలున్నాయి.
అయితే యడియూరప్ప మాత్రం.. విస్తరణ మాత్రమే జరుగుతుందని ప్రకటించారు. విస్తరణ అంటే.. ఇటీవల ఉప ఎన్నికల్లో నెగ్గిన పదిమంది ఎమ్మెల్యేలనూ మంత్రులుగా చేయడం, అలాగే పార్టీలోని పాత వాళ్లు ముగ్గురిని మంత్రులు గా తీసుకోవడం. ఇలా తన కేబినెట్లోకి కొత్త వారు చేరుతారు తప్ప, ఉన్న వారి స్థానాలు మారవని యడియూరప్ప ప్రకటించారు.
కేబినెట్ సమూలంగా మారుతుందని కొందరు బీజేపీ నేతలు ఎక్స్ పెక్ట్ చేశారు. యడియూరప్ప ప్రభుత్వం ఏర్పడినప్పుడు.. కొందరికి అనూహ్యంగా మంత్రి పదవులు దక్కాయి. వారిలో ఎమ్మెల్యేలు గా నెగ్గని వారు కూడా ఉన్నారు. అలాంటి ఒకరిద్దరు మంత్రులు కావడంతో పాటు, డిప్యూటీ సీఎం పదవిని కూడా ఒకరు సొంతం చేసుకున్నారు. అలా అనూహ్యం గా అవకాశం పొందిన కొందరిని ఇప్పుడు తప్పిస్తారని.. పోటీ గట్టిగా ఉన్న నేపథ్యంలో కొందరికి అవకాశాలు లభిస్తాయని పార్టీలోని పాత కాపులు ఆశించారు. ముగ్గురు మంత్రులను తొలగిస్తారని, వారి స్థానంలో వేరే వాళ్లకు అవకాశం దక్కుతుందనే ప్రచారం జరిగింది. అయితే అలాంటి ప్రచారాలకు యడియూరప్ప చెక్ పెట్టారు.
కొత్తగా మంత్రులను చేర్చుకోవడమే, ఇతర మార్పు చేర్పులు ఉండవని ఆయన స్పష్టత ఇచ్చారు. విస్తరణ మాత్రమే జరుగుతుందని, పునర్వ్యస్థీకరణ కాదని ఆయన ప్రకటించారు. ఇది భారతీయ జనతా పార్టీ కర్ణాటక నేతల్లో అసహనాన్ని పుట్టించేది లానే ఉన్నట్టుంది!