Begin typing your search above and press return to search.

అంతా అధిష్టానం చెప్పినట్టే!

By:  Tupaki Desk   |   20 Aug 2019 5:49 AM GMT
అంతా అధిష్టానం చెప్పినట్టే!
X
కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడి 23 రోజులు దాటిన తర్వాత ఎట్టకేలకు 17 మందితో మంత్రివర్గం ఏర్పాటుకు సిద్ధం చేశారు. ఇప్పటికే రాజ్‌ భవన్‌ లో ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. అయితే సీఎం యడియూరప్ప అందజేసిన నివేదికలో లింగాయత్‌ సముదాయానికి చెందిన వారు ఎక్కువ మంది ఉండటంతో వాటిలో కొన్నింటికి కత్తెర వేసి అమిత్‌ షా నేతృత్వంలో మరో జాబితా తయారు చేశారు. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు - ఎంపీలు - మంత్రులు బెంగళూరుకు చేరుకోవాలని పార్టీ కార్యాలయం నుంచి సందేశం పంపించారు.

మంత్రివర్గం ఏర్పాటు గురించి గవర్నర్‌ వీఆర్‌ వాలాకు సమాచారం ఇచ్చామని.. గవర్నర్‌ సమక్షంలో మంగళవారం ఉదయం కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారని ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప తెలిపారు. ఈ సందర్భంగా కొత్త మంత్రులకు హితబోధ చేయాలని గవర్నర్‌ ను కోరినట్లు చెప్పారు. అయితే మంత్రివర్గంలో చోటు ఎవరెవరికి ఇచ్చామనేది పార్టీ పెద్దల నిర్ణయమే అన్నారు.

జగదీశ్‌ శెట్టర్‌ (ధారవాడ సెంట్రల్‌) - వి.సోమణ్ణ (గోవిందరాజనగర) - కేఎస్‌ ఈశ్వరప్ప (శివమొగ్గ) - మాధుస్వామి (చిక్కనాయకనహళ్లి) - ఆర్‌.అశోక్‌ (పద్మనాభనగర) - సురేశ్‌ కుమార్‌ (రాజాజినగర) - బసవరాజు బొమ్మయి (శిగ్గావి) - బి.శ్రీరాములు (మొలకల్మూరు) - గోవింద కారజోళ (ముధోళ) - అశ్వర్థనారాయణ (మల్లేశ్వరం) - కోటా శ్రీనివాసపూజారి (ఎమ్మెల్సీ) - హెచ్‌.నగేశ్‌ – ముళబాగిలు (స్వతంత్య్ర) - లక్ష్మణ సంగప్ప సావది (ఎమ్మెల్సీ) - సీటీ రవి (చిక్కమంగళూరు) - సీసీ పాటిల్‌ (నరగుంద) - ప్రభు చౌహాన్‌ (ఔరాద్‌) - శశికళా జొల్లె అన్నాసాహెబ్‌ (నిప్పాణి)