Begin typing your search above and press return to search.
కర్ణాటక క్యాంపు రాజకీయం.. ఈ సారి రివర్స్ అయ్యిందే!
By: Tupaki Desk | 10 March 2020 12:15 PM GMTసాధారణంగా కర్ణాటక ఎమ్మెల్యేలు ఇతర రాష్ట్రాల క్యాంపులకు తరలి వెళ్లే వాళ్లు,. రాజకీయ సంక్షోభాలను తరచూ ఎదుర్కొనే రాష్ట్రం అది. దీంతో ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. క్యాంపులు తప్పనిసరి. అలాగే ప్రభుత్వాలు పడిపోవడాలు, కొత్త ప్రభుత్వాలు ఏర్పడటాలు, అధికార పార్టీలు- ప్రతిపక్ష పార్టీలు క్యాంపులు నడపడానికి ఇతర రాష్ట్రాల వైపు వెళ్తూ ఉంటారు!
దాదాపు రెండేళ్ల కిందట అసెంబ్లీ ఎన్నికల జరిగినప్పుడు భారీ ఎత్తున క్యాంపు రాజకీయాలు నడిచాయి. అప్పట్లో కర్ణాటక కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ లోని ఒక స్టార్ హోటల్లో క్యాంపులు నిర్వహించారు. ఆ క్యాంపుల నిర్వహణలో కాంగ్రెస్ తెలంగాణ నేతలు పాలుపంచుకున్నారు. అప్పట్లో జేడీఎస్ తో సన్నిహిత సంబంధాల కోసం కేసీఆర్ కూడా వాటికి సహకారం అందించినట్టుగా వార్తలు వచ్చాయి.
ఇక అప్పట్లో బీజేపీ వాళ్లూ తమ క్యాంపులు నిర్వహించారు. గోవాలో, మహారాష్ట్రలో వారి క్యాంపులు నడిచాయి. అయితే బీజేపీ ప్రభుత్వం అప్పుడు నిలబడలేదు. కాంగ్రెస్ -జేడీఎస్ ప్రభుత్వం ఏర్పడింది. అయినా బీజేపీ నిద్రపోలేదు. ఆ పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చీల్చింది. వాళ్లతో క్యాంప్ నిర్వహించింది. అప్పుడు బీజేపీ క్యాంపు ముంబైలో చోటు చేసుకుంది, అక్కడ అప్పుడు బీజేపీ ప్రభుత్వమే ఉండటంతో.. కాంగ్రెస్-జేడీఎస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలను అక్కడ దాచారు.
అలా పక్క రాష్ట్రాల్లో ఎమ్మెల్యే క్యాంపు ఆశ్రయాలనే కోరే కర్ణాటక ఇప్పుడు ఒక క్యాంపుకు ఆశ్రయం ఇస్తోంది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు కర్ణాటక రాజధాని ఆశ్రయం కల్పిస్తూ ఉంది. రాజానుకుంటే లోని ఒక రిసార్ట్ లో తిరుగుబాటు ఎమ్మెల్యేలు స్టే చేశారట. తమకు రక్షణ కల్పించాలని, తాము ఒక అతి ముఖ్యమైన పని మీద బెంగళూరు వచ్చినట్టుగా వాళ్లంతా కర్ణాటక డీజీపీకి లేఖ కూడా రాశారట. కర్ణాటకలో ఇప్పుడు ఎలాగూ ఉన్నది బీజేపీ ప్రభుత్వమే. ఈ నేపథ్యంలో.. ఈ కాంగ్రెస్ వ్యతిరేక క్యాంపుకు ప్రభుత్వం భద్రతను కల్పించడంలో పెద్ద ఆశ్చర్యం ఉండదేమో!