Begin typing your search above and press return to search.
గుక్కపట్టి ఏడ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి.. వైరల్ ఫొటోలు.. కారణమిదే
By: Tupaki Desk | 14 Jun 2022 4:30 PM GMTఒక రాష్ట్రానికి సీఎం అయ్యిండి వెక్కివెక్కి ఏడ్చాడు. అందరి ముందే కంటతడి పెట్టాడు. చిన్న పిల్లాడిలా ఏడుపు లంఖించాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కదిలించింది ఏంటో తెలుసా? ఒక సినిమా.. 777 చార్లీ అనే సినిమా ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఈ సినిమా చూసి ఏకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రియే ఏడవడం గమనార్హం.
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై 777 చార్లీ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సినిమాలో పెంపుడు కుక్కతో ఒక వ్యక్తికి ఉన్న అనుబంధాన్ని చూపించారు. అయితే సీఎం బొమ్మైకి చనిపోయిన తన పెంపుడు కుక్క గుర్తుకు వచ్చి కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. అందరి ముందే వెక్కివెక్కి ఏడ్చేశారు. సోషల్ మీడియాలో ఆ ఫొటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. పెంపుడు కుక్కతో అనుబంధాన్ని చాటే ఆ సినిమా చూస్తూ ఆయన చాలా భావోద్వేగానికి గురయ్యాడు.
సినిమా చూసిన అనంతరం సీఎం బొమ్మై మాట్లాడుతూ.. కుక్కల గురించి చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమాలో జంతువులతో ఉండే అనుబంధం, భావోద్వేగాన్ని చాలా గొప్పగా చూపించారని కొనియాడారు. కుక్క తన భావోద్వేగాలను కండ్ల ద్వారా వ్యక్తపరుస్తోంది. సినిమా చాలా బాగుంది.. అందరూ చూడదగిన సినిమా అన్నారు. కుక్కల ప్రేమ అనేది షరతులు లేని ప్రేమ. ఇది స్వచ్ఛమైన ప్రేమ అని అన్నారు.
కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై స్వతహాగా కుక్కలప్రేమికుడు. గత ఏడాది తన పెంపుడు కుక్క చనిపోవడంతో ఆయన చాలా బాధపడ్డారు. పెంపుడు కుక్క మరణాన్ని తలుచుకొని ఆయన బోరున విలపిస్తున్న ఫొటోలు అప్పట్లోనే వైరల్ అయ్యాయి.