Begin typing your search above and press return to search.

ఒక్క ట్వీట్ తో సీఎం పరువు తీసేశారుగా!

By:  Tupaki Desk   |   22 Dec 2016 1:39 PM GMT
ఒక్క ట్వీట్ తో సీఎం పరువు తీసేశారుగా!
X
చిన్న అక్షరం చాలు పూర్తి అర్ధాన్ని మార్చేయడానికి. చిన్న పదదోషం చాలు కొంప ముంచే అర్ధన్ని ఇవ్వడానికి. అది స్కూల్లో స్టూడెంట్ చేస్తే మార్కులు తక్కువ పడతాయి లేదా బెత్తం దెబ్బలు పడతాయి. అలాంటిది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందే ఆ పొరపాటు చేస్తే.. అది చిన్న అక్షర దోషమే అయినా ఏ స్థాయిలో పరువు తీస్తుంది. తాజాగా అదే జరిగింది! అవును.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కార్యాలయ సిబ్బంది ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఒక వాక్యంలోని చిన్న పదంలో స్పెల్లింగ్ మిస్టేక్ నవ్వులు పూయించింది.. కాదు కాదు నవ్వుల పాలు చేసిందనే చెప్పుకోవాలి!!

తాజాగా కర్ణాటక సీఎంను చైనాకు చెందిన ప్రతినిధి బృందం కలిసి బెంగళూరు అభివృద్ధి, ఇతర విషయాల గురించి చర్చించింది. దీంతో సీఎం సిద్దరామయ్య పేరుతో ఆయన ఆఫీసు స్టాఫ్ ఒక ట్వీట్ పోస్ట్ చేశారు. అదేమిటంటే... "చైనాలోని సియాచిన్‌ ప్రావిన్స్‌ నుంచి లీ జోంగ్‌ సారథ్యంలో వచ్చిన బృందంతో సీఎం సమావేశమయ్యి పలు విషయాలపై చర్చించారు". అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా... ఇక్కడే ఉంది అసలు విషయం.

ఈ ట్వీట్ లో సీఎం కార్యాలయ సిబ్బంది పేర్కున్నట్లు "సియాచిన్‌" అనేది వాస్తవాధీన రేఖ వద్ద భారత భూభాగంలో గల హిమాలయ పర్వత శ్రేణి. ఆరో తరగతి సోషల్ పుస్తకంలో ఉండే ఈ విషయంలో మరిచారో ఏమో కానీ... చైనాలో "సిచువాన్‌" అనే ప్రావిన్స్‌ కు బదులు "సియాచిన్" అని మార్చేశారు. దీంతో స్పెల్లింగ్ మిస్టేక్ అనుకునే వారి కంటే... సియాచిన్‌ అనే ప్రాంతం చైనాలో ఉన్నట్టుగా కూడా అర్థం వచ్చేలా ఉంది. ఇప్పటికే భారత్ - చైనా లమద్య సంబందాలు అంతంత మాత్రంగా ఉండటమే కాకుండా... పాక్ తో చైనా స్నేహం విషయంలో మన మధ్య చాలా మనస్పర్ధలు ఉన్నాయి. దీంతో ఈ ట్వీట్‌ చూడగానే రాజకీయ వర్గాలు, నెటిజన్లు తమదైన స్టైల్లో విమర్శలు మొదలుపెట్టేశారు. చేసింది చిన్న పొరపాటే కావొచ్చు.. అలా అని ప్రతి చిన్న పొరపాటుకీ చిన్న ఇబ్బందే కలగాలని, చిన్న అవమానమే కలగాలని రూలేమీ లేదు కదా!!

ఇలా వచ్చిన ట్వీట్లలో ఒక ట్వీట్... సియాచిన్‌ చైనాలో ఉందా?.. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి సియాచిన్‌ కు, సిచువాన్‌ కు గల తేడా చెప్పేవారు లేరా? అని. ఇది చాలదా ఆ ట్వీట్ నవ్వించిందో నవ్వుల పాలు చేసిందో చెప్పడానికి!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/