Begin typing your search above and press return to search.
జగన్ తో నిఖిల్ గౌడ భేటీ.. ప్లాన్ పెద్దదే గురూ
By: Tupaki Desk | 11 Jun 2019 2:04 PM GMTవైసీపీ అధినేత, ఏపీ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మంగళవారం జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ మనవడు, కర్ణాటక సీఎం కుమారుడు - జేడీఎస్ వారసుడిగా భావిస్తున్న నిఖిల్ గౌడ కలిశారు. బెంగళూరు నుంచి అమరావతి వచ్చిన ఆయన జగన్ ను కలవడం వెనుక పెద్ద వ్యూహమే ఉందన్న వాదన వినిపిస్తోంది. సినిమాల్లో హీరోగా నటించినా... పెద్దగా క్లిక్ కాని నిఖిల్... రాజకీయ అరంగేట్రంలోనూ బోల్తా పడ్డారు. ప్రముఖ సినీ నటి సుమలత చేతిలో ఆయన తాజా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో జగన్ తో నిఖిల్ భేటీ వెనుక ఉన్న అసలు సిసలు వ్యూహంపై ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
నిఖిల్ రచించుకున్న వ్యూహం నిజంగానే ఆసక్తికరంగా ఉందని చెప్పక తప్పదు. ఎందుకంటే... ప్రస్తుతం తన తండ్రి కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కారు ఎప్పుడు కూలుతుందో కూడా తెలియదు. ఓ పక్క మిత్రపక్షంగా ఉంటూనే కుమారకు ఎక్కడికక్కడ బ్రేకులు వేసుకుంటూ కాంగ్రెస్ సాగుతుంటే... మరోపక్క ఎప్పుడెప్పుడు సంకీర్ణ సర్కారును కూల్చేసి సీఎం పీఠంలో కూర్చుందామా అని బీజేపీ నేత, కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప కాసుక్కూర్చున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేసి సంకీర్ణ సర్కారును కూల్చేందుకు బీజేపీ వ్యూహం పన్నుతోంది. ఇటు కాంగ్రెస్ అడ్డుపుల్లలు, అటు బీజేపీ కుటిల యత్నాల నేపథ్యంలో కుమార సర్కారు ఏ క్షణమైనా కూలే అవకాశాలున్నాయి.
ఈ క్రమంలో అమరావతికి వచ్చిన నిఖిల్... తన తండ్రి సర్కారును మరింత బలోపేతం చేయడంతో పాటుగా ఇకపై కన్నడ నాట జేడీఎస్ ను తిరుగులేని పార్టీగా తీర్చిదిద్దే ప్లాన్ ను రచించారట. ఈ వ్యూహం ప్రకారం.. కర్ణాటకలో రెడ్డి సామాజిక వర్గం బలంగానే ఉంది. తాజా ఎన్నికల్లో ఏపీలో బంపర్ విక్టరీని కొట్టేసిన జగన్... రెడ్డి సామాజిక వర్గానికి నూతన ఐకాన్ గా నిలిచారు. గతంలో చంద్రబాబుతో కుమారస్వామితో పాటు దేవేగౌడ కూడా మంతనాలు సాగించి జేడీఎస్ గెలుపు కోసం పలు ప్లాన్లు రచించినా అవేవీ వర్కవుట్ కాలేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో పనికాదని తెలుసుకున్న నిఖిల్... రెడ్డి సామాజిక వర్గానికి చుక్కానిలా నిలిచిన జగన్ తో మచ్చిక చేసుకుంటే మంచిదని భావించారట. ఈ క్రమంలోనే ఆయన జగన్ వద్దకు రెక్కలు కట్టుకుని వచ్చి వాలారట.
కన్నడ నాట ఎప్పుడు ఎన్నికలు జరిగినా...రెడ్డి సామాజిక వర్గాన్ని తమ వైపునకు తిప్పుకుంటే... మిత్రపక్షాలతో అవసరం లేకుండానే అధికార పీఠం దక్కించుకోవచ్చన్నది నిఖిల్ ప్లాన్ గా చెబుతున్నారు. మరి కన్నడ రెడ్లంతా జేడీఎస్ వైపు తిరగాలంటే... జగన్ లాంటి నేత మద్దతు అవసరమే కదా. అందుకే జగన్ వద్దకు నిఖిల్ వచ్చినట్గుగా విశ్లేషణలు సాగుతున్నాయి. నిఖిల్ తో చర్చల్లో జగన్ ఎలా స్పందించారో తెలియదు గానీ... తన సామాజిక వర్గాన్ని జేడీఎస్ వైపు తిప్పితే... జగన్ కన్నడ నాట కూడా కీలక భూమిక పోషించినట్టే అవుతుంది. కన్నడ నాట జగన్ కు ఓ రేంజిలో ఇమేజీని క్రియేట్ చేయడంతో పాటు జగన్ సహకారంతో తాము కర్ణాటకలో బలీయమైన రాజకీయ శక్తిగా ఎదిగేందుకు నిఖిల్ ప్లాన్ వేశారన్న మాట. మరి ఈ భారీ ప్లాన్ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.