Begin typing your search above and press return to search.
ఎగ్జిట్ పోల్స్ ను ఎటకారం చేసిన సీఎం
By: Tupaki Desk | 13 May 2018 9:37 AM GMTయావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ముగిసింది. ఓట్లు వేసే కార్యక్రమం అలా పూర్తి అయ్యిందో లేదో.. పలు మీడియా సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించాయి. ఇటీవల కాలంలో ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగితే.. ఇంత భారీగా (దాదాపు 17 మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి) ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు.
అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పిందేమంటే.. అధికారం ఏ పార్టీ చేతికి రాదు. హంగ్ ఖాయం అంటూ తేల్చాయి. మొత్తం 17 ఎగ్జిట్ పోల్స్ ను చూస్తే.. పది సర్వేల్లో బీజేపీకి అధిక్యం రావొచ్చన్న మాట వినిపిస్తే.. మరో ఏడు సర్వేలు కాంగ్రెస్ కే పవర్ ఖాయమని తేల్చాయి.
ఇదే సమయంలో ఎవరికి వారు తమకే అధికారం అంటే.. తమకే అధికారం అని చెప్పుకోవటం మొదలైంది. యడ్యూరప్ప లాంటోళ్లు అయితే.. ఒక అడుగు ముందుకేసి తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే ముహుర్తాన్ని చెప్పేయటం ఆసక్తికరంగా మారింది.
ఎగ్జిట్ పోల్స్.. బీజేపీ నేతల ఉత్సాహం నేపథ్యంలో కాంగ్రెస్ వర్గాలు కాసింత చిన్నబోయినట్లుగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని గుర్తించారేమో కానీ.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాస్త హుషారు తెచ్చే ప్రయత్నం చేసినట్లుగా చెప్పాలి. ఎగ్జిట్ పోల్స్ ను ఏసుకున్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్ సారాంశం హంగ్ అని తేల్చగా.. సిద్ధరామయ్య మాత్రం అందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేశారు.
వచ్చే రెండు రోజులు ఎగ్జిట్ పోల్స్ వినోదాన్ని పంచబోతున్నాయి.. నదిని ఈదలేనోడు లోతు లెక్కలు చూసుకొని మురిసిపోతుంటాడట. చివరకు తప్పుడు అంచనాలతో నీట్లో మునిగిపోతాడు. కొందరికి అలాంటి పరిస్థితే ఎదురుకాబోతోందంటూ బీజేపీ నేతల్ని ఉద్దేశించి వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో పార్టీ కార్యకర్తలు ఎగ్జిట్ పోల్స్ ను చూసి బాధపడాల్సిన అవసరం లేదని.. ఈ వీకెండ్ హ్యాపీగా ఎంజాయ్ చేయాలని ఆయన కోరుతున్నారు. కాంగ్రెస్ శ్రేణులన్నీ సావధానంగా ఉండాలని.. మళ్లీ తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్న వాదనను వినిపించారు. మాజీ ముఖ్యమంత్రి యాడ్యూరప్ప మానసికంగా కుంగిపోయి ఉన్నారని అందుకే ఈ నెల 17న ప్రమాణస్వీకారం చేయనున్నట్లుగా చెప్పారని.. వారికి 60-65 సీట్లకు మించి వచ్చే అవకాశమే లేదని స్పష్టం చేశారు. సిద్ధరామయ్య మాటల్లో నిజం ఎంతన్నది మరో రెండు రోజులు వెయిట్ చేస్తే సరిపోతుందని చెప్పక తప్పదు.