Begin typing your search above and press return to search.
అమిత్ షానే మా ప్రచార నాయకుడు..కాంగ్రెస్ సంతోషం
By: Tupaki Desk | 5 April 2018 12:44 PM GMTకన్నడ రాష్ట్రంలో ఎన్నికల హీటెక్కుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ రథసారథి రాహుల్‌గాంధీ ఆ రాష్ట్రంలో చుట్టేస్తూ వేడిని పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఆ రాష్ట్రంలోని పాతుకుపోయిన జేడీఎస్ సైతం ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా జోరు పెంచారు. గత మూడు రోజులుగా కర్ణాటకలో పర్యటిస్తున్న ఆయన.. మైసూరుతో పాటూ పలు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. అక్కడ ప్రముఖ మఠాలను సందర్శిస్తూ.. మఠాధిపతుల ఆశీర్వాదం తీసుకుంటున్నారు. అయితే ఆయన తమకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ సంతోషం వ్యక్తం చేస్తోంది. నిజంగా నిజం. బహిరంగంగా ఆ మాట చెప్పుకుటోంది మరి.
కర్ణాటకలో తమ సీఎం అభ్యర్థి అయిన యడ్యూరప్ప అతిపెద్ద అవినీతిపరుడంటూ షా ఇటీవలే నోరు జారిన సంగతి తెలిసిందే. ఇంకో సభలో మాట్లాడుతూ ప్రధాని మోడీ దేశాన్ని నాశనం చేశారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అనంతరం అమిత్ షా పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అయితే మరుసటి రోజే ఇంకో తప్పిదం జరిగింది. కర్ణాటకలో సిల్క్ ఉత్పత్తి గరిష్ఠ స్థాయికి చేరుకుందని అమిత్ షా తెలిపారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఖుష్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సిల్క్ ఉత్పత్తి గొప్ప స్థాయికి చేరిందనే విషయాన్ని అమిత్ షా ప్రకటించినందుకు సంతోషమని పేర్కొంది. ఆ పార్టీ ముఖ్యమంత్రి నాయకుడిని కూడా అవినీతిపరుడిగా ప్రకటించినందుకు సంతోషమని వెల్లడించింది. తమ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ అమిత్ షానే అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దీంతో తమ అగ్రనాయకుడి ప్రకటనపై అసహనం వ్యక్తం చేయలేక...వాటిని అంగీకరించలేక పార్టీ నేతలు సతమతం అవుతున్నారు.