Begin typing your search above and press return to search.
రోడ్డు ప్రమాదంలో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే!
By: Tupaki Desk | 28 May 2018 4:50 AM GMTకర్ణాటక కాంగ్రెస్ పార్టీకి ఊహించనిరీతిలో ఎదురుదెబ్బ తగిలింది. అనుకోని విషాదం ఇప్పుడా పార్టీని చుట్టుముట్టింది. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో ప్రతి ఎమ్మెల్యే ఎంతో కీలకం. పూర్తి అంకెలాటగా మారిన రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో ఏ చిన్న పరిణామం కూడా భారీ మార్పుల దిశగా అడుగులు వేస్తుందని చెప్పాలి.
తాజాగా అలాంటి పరిస్థితే కర్ణాటక కాంగ్రెస్ కు ఎదురైంది. ఆ పార్టీ ఎమ్మెల్యే.. సీనియర్ నేత.. జంఖండి ఎమ్మెల్యే సిద్ధు భీమన్నన్యామ్ గౌడ్ సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
గోవా నుంచి బాగల్ కోట్ కు రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే కారును ఎదురుగా వస్తున్న లారీ ఒకటి తులసిగిరి వద్ద ఢీ కొట్టింది. దీంతో.. ఎమ్మెల్యే తీవ్ర గాయాలపాలయ్యారు. హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తరలిస్తున్న మార్గ మధ్యంలోనే ఆయన ప్రాణాలు విడిచారు.
ప్రస్తుతం కర్ణాటక అధికారపక్షాలైన కాంగ్రెస్.. జేడీఎస్ లలో మహా సందడిగా ఉంది. మంత్రివర్గ కసరత్తు జరుగుతున్న వేళ.. అమాత్య పదవిని దక్కించుకునేందుకు ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సిద్దు భీమప్ప మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఇప్పటికే రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన.. ఈసారి మంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉండగా.. ఊహించని రీతిలో చోటు చేసుకున్న ప్రమాదంతో పార్టీ.. ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ప్రతి ఎమ్మెల్యే కీలకమైన వేళ.. చోటు చేసుకున్న ఈ షాకింగ్ పరిణామం కాంగ్రెస్ కు ఏ మాత్రం మింగుడుపడనిదిగా మారింది. భీమప్పకు మంత్రి పదవి పక్కా అనుకున్న వేళ.. చోటు చేసుకున్న ఈ విషాదంపై ముఖ్యమంత్రి కుమారస్వామి తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. సోమవారం సాయంత్రమే గౌడ్ అంత్యక్రియలు జరపాలన్న నిర్ణయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తీసుకున్నట్లుగా చెబుతున్నారు.