Begin typing your search above and press return to search.
కిల్లర్ మోహన్ ... గర్భ నిరోధక ట్యాబ్లేట్ అంటూ సైనేడ్
By: Tupaki Desk | 22 Jun 2020 7:50 AM GMTప్రేమించానని నమ్మించడం ...పెళ్లి అంటూ మోసం చేయడం. ఈ మధ్య కాలంలో ఇటువంటి కేసులు బాగా పెరిగిపోతున్నాయి. అలాగే ఈ రకమైన మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. మోసపోయే వారు ఉన్నంత కాలం మోసం చేసేవారు ఉంటారు అన్నట్టుగా తాజాగా మరో మోసగాడు వెలుగులోకి వచ్చాడు. కేరళలోని కాసరగోడులో ఓ యువతిపై ఆత్యాచారంతో పాటు అనేక కేసుల్లో దోషిగా నిరూపితమైన సైనేడ్ మోహన్ మరో కేసు లోనూ దోషిగా తేలాడు.
ఈ మేరకు సైనేడ్ మోహన్ దోషిగా అభివర్ణిస్తూ మంగళూరు కోర్టు తీర్పునిచ్చింది. యువతిని పెళ్లి చేసుకొంటానని నమ్మించి అత్యాచారం చేసి హత్య చేశాడు. మోహన్ పై ఇలా 20 కేసులు నమోదు కాగా 19 కేసుల్లో నిందితుడు దోషిగా కోర్టు తీర్పునిచ్చింది. ఇందులోనాలుగు కేసులో మరణశిక్షతో పాటు 15 కేసులో యావజ్జీవ కారగార శిక్షను విధించింది. ఈ నెల 24న మోహన్ కు మిగిలిన ఒక్క కేసులోనూ కోర్టు శిక్ష విధించే అవకాశం ఉంది.
కాసరగోడులో మహిళా హాస్టల్‌లో వంటమనిషిగా పని చేస్తున్న 25 ఏళ్లు యువతిని 2009లో మోహన్ పరిచయం చేసుకొన్నాడు. ప్రేమ, పెళ్లి పేరుతో లోబర్చుకున్నాడు. 2009 జులై 8న మంగళూరు సుళ్యలోని దేవస్థానికి వెళ్దామని ఆమెను బెంగళూరుకు తీసుకొచ్చాడు. పెళ్లి చేసుకున్నాం, త్వరలో ఇంటికి వస్తామని యువతి కుటుంబసభ్యులను నమ్మించాడు. బెంగళూరులో ఒక లాడ్జిలో రూం తీసుకొని యువతిపై ఆత్యాచారం చేశాడు. జులై 15న గర్భ నిరోధక మాత్ర అంటూ మెజెస్టిక్ బస్టాండ్‌లో సైనైడ్ మాత్రను మింగించాడు.
ఆమె పబ్లిక్ టాయ్‌లెట్ వద్దకు వెళ్లి కుప్పకూలి అక్కడే ప్రాణాలు విడిచింది. ఏమీ తెలియనట్లు మోహన్ జారుకున్నాడు. పోలీసులు అపరిచిత యువతి మృతి కేసుగా నమోదు చేసుకున్నారు. విచారణ జరిపి 2009 అక్టోబర్‌లో మోహన్ ను అరెస్ట్ చేశారు. అతన్ని విచారించగా దిగ్భ్రాంతిగొలిపే దారుణాలను బయటపెట్టాడు.ఈ విధంగా ఈ ఒక్క అమ్మాయినే కాదు ..ఇప్పటివరకు ఎంతో మంది మహిళలను మభ్యపెట్టి సైనేడ్ ఇచ్చి హత్య చేసినట్లు వివరించాడు. ఇందులో ఎక్కువమంది కేరళ, మంగళూరు ప్రాంతాల్లోని పేద వర్గాలకు చెందిన మహిళలు ఉన్నారు. బాధిత మహిళల కుమారులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మోహన్ కు అనేక కేసుల్లో కోర్టు శిక్షలను విధించింది. ప్రస్తుతం ఇతడు బెళగావి జైల్లో ఉన్నాడు.